poulomi avante poulomi avante

ఎమ్మెల్యే కాలనీలో ఇల్లు కొన్న చిరంజీవి!

  • శ్రీజకు గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కోట్ల రూపాయల విలువ చేసే అనేక‌ ఆస్తులు కలిగి ఉన్న ఆయన.. తాజాగా హైదరాబాద్ లో మరో ప్రాపర్టీని కొనుగోలు చేశారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో కొత్త ఇల్లు కొన్నారు. దాదాపు రూ. 35 కోట్ల విలువ చేసే ఆ ఇంటిని తన కుమార్తె శ్రీజకు బహుమతిగా ఇచ్చినట్టు సమాచారం.

కాగా, గతేడాది ఆగస్టులో చిరంజీవి హైదరాబాద్లో విలువైన ప్రాపర్టీని విక్రయించినట్టు వార్తలొచ్చాయి. 1990లలో ఫిల్మ్ నగర్ ప్రాంతంలో రూ. 30 లక్షలు వెచ్చించి భూమి కొన్నారు. మొన్న ఆగస్టులో దానిని రూ.70 కోట్లకు విక్రయించినట్టు వార్తలు వచ్చాయి. ఇక మెగాస్టార్ ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో రూ. 28 కోట్లు విలువ చేసే లగ్జరీ విల్లాలో ఉంటున్నారు. హెరిటేజ్ డిజైన్ ఆధునిక అభిరుచులకు తగినట్టుగా కట్టుకున్నారు. ఇంటి ముందు విశాలవంతమైన గార్డెన్ కూడా ఉంటుంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles