CII Telangana New Chairman is C. Shekar Reddy
సీఐఐ తెలంగాణ ఛైర్మన్‌గా సి.శేఖర్ రెడ్డి, వైస్ ఛైర్మన్‌గా భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ లు ఎన్నియ్యారు. బిల్డర్స్ ఫోరం వ్యవస్థాపకులైన సి.శేఖర్ రెడ్డి.. ఆతర్వాత రాష్ట్రంలో క్రెడాయ్ హైదరాబాద్‌ను ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణ రంగానికి సంబంధించిన అనేక పాలసీల రూపకల్పనలో క్రియాశీలక పాత్ర పోషించారు. పట్టణాల అభివృద్ధి పట్ల విశేషమైన అనుభవం ఉండటం గమనార్హం. క్రెడాయ్ నేషనల్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై.. దేశీయ నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయడంలో ముఖ్యభూమిక వహించారు. దేశవ్యాప్తంగా క్రెడాయ్ ఖ్యాతిని విస్తరింపజేయడానికి కృషి చేశారు. మనదేశంలో నిర్మాణ రంగాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేసిన ఆయన.. 2022-23లో సీఐఐ తెలంగాణకు వైస్ ఛైర్మన్ మరియు మెంబర్‌షిప్ ప్యానెల్ కన్వీనర్‌గా వ్యవహరించారు.
This website uses cookies.