తెలంగాణ రాష్ట్రంలో సామాన్య, నిరుపేద ప్రజలు సొంతిల్లు కట్టుకుని సంతోషంగా నివసించొచ్చు. తాజాగా , రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్కీమును ప్రకటించడమే ఇందుకు ప్రధాన కారణం. దీనికి గృహలక్ష్మీ అని నామకరణం చేసింది. రాష్ట్రంలో సొంత స్థలం ఉన్నవారికి ఇక నుంచి ఇల్లు కట్టిస్తుంది. ప్రతి ఇంటికి రూ.3 లక్షలను గ్రాంట్ రూపంలో మూడు దఫాలుగా ఇవ్వాలని గురువారం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ స్కీము కింద ప్రతి నియోజకవర్గంలో దాదాపు 4 లక్షల ఇళ్లను కట్టిస్తారు. ఇందుకోసం సుమారు రూ.12 వేల కోట్లను బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించింది. ఇందులో భాగంగా కట్టే ఇళ్లన్నీ మహిళల పేరిట ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో గత ఇందిరమ్మ పథకంలో భాగంగా నాలుగు వేల కోట్ల అప్పులను రద్దు చేశారు.
This website uses cookies.