Categories: LATEST UPDATES

ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉంటే కూల్చేయండి

సీఎం సోదరుడు తిరుపతిరెడ్ది

హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్ది స్పందించారు. 2015లో అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో తాను ఇల్లు కొనుగోలు చేశానని.. అది ఎఫ్‌టీఎల్‌ పరిధిలో వస్తుందని తనకు తెలియదన్నారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్న తనకు అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు. మరోవైపు దుర్గం చెరువును ఆనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు. వీటిలో పలువురు ఐఏఎస్, ఐఆర్‌ఎస్‌ అధికారులు, సినీ, రాజకీయ, ప్రముఖులు నివసించే భవనాలు ఉండటం గమనార్హం. నెలలోగా అక్రమ కట్టడాలు కూల్చేయాలని స్పష్టం చేశారు.

కాగా ఇప్పటికే ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లో ఎవరు నిర్మాణాలు చేసినా కూల్చివేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. . తన ఫ్యామిలీ కబ్జా చేసినా.. కూల్చివేయిస్తానని సీఎం రేవంత్ అన్నారు.

This website uses cookies.