Categories: LATEST UPDATES

చెరువుల ప‌రిర‌క్ష‌ణ షురూ!

హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులు, కుంటలను ప‌రిర‌క్షించే ప్ర‌క్రియకు ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టింది. అదేవిధంగా, ల్యాండ్ ఫూలింగ్ సైతం వేగ‌వంతంగా దూసుకెళ్లే వీలుంది. ఇందుకోసం జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలని, సమన్వయంతో పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు 8,374 ఎకరాల ల్యాండ్ పార్శిళ్ల‌లో.. 2031 పార్శిళ్లకు సంబంధించి వివిధ స్థాయిల్లో కోర్టు కేసులున్నాయి. హెచ్ఎండీఏ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని, డిజిటల్, జీపీఎస్ విధానాలతో ఎక్కడ ఎంత స్థలముందో మ్యాపింగ్ చేయాలని సీఎం సూచించారు.

తమ పరిధిలో ఉన్న స్థలాలతో హెచ్ఎండీఏ ఆదాయం పెంచుకునే చర్యలు చేపట్టాలని చెప్పారు. అడ్వర్టయిజ్మెంట్ల ద్వారా వచ్చే ప్రకటనల ఆదాయంపై కూడా దృష్టి పెట్టాలన్నారు. ల్యాండ్ ఫూలింగ్, ల్యాండ్ పార్శిల్స్, చెర్వులు, కుంటలు ఆక్రమణకు గురి కాకుండా చూసేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించాలని అన్నారు. డీఐజీ స్థాయిలో ఒక ఐపీఎస్ అధికారిని నియమించాలని, ఇద్దరు ఎస్పీ ర్యాంకు అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సీఎం సూచించారు.

This website uses cookies.