కొవిడ్ నేపథ్యంలో.. రానున్న రోజుల్లో వాణిజ్య, రిటైల్ రంగాలపై గణనీయమైన ఒత్తిడి ఉంటుందని పలు సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. పట్టణాల ప్రజలు చేసే ఖర్చు ఆధారంగా రిటైల్ లీజింగ్ డిమాండ్ ఆధారపడుతుంది. కరోనా మహమ్మారి సృష్టించిన సవాళ్లను మరియు అవకాశాల్ని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. అందుకే, వాణిజ్య సముదాయాల అంచనాల్ని ఇప్పుడే నిర్దిష్ఠంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అంతర్జాతీయ ప్రయాణాలపై పరిమితులున్నాయి. పైగా, కార్యాలయాలకు మళ్లీ ఉద్యోగులు ఎప్పుడొస్తారు? ఎంతమంది వస్తారనే విషయంలో స్పష్టత లేదు. కాబట్టి, కొత్త లీజింగుల గురించి ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది.
* ఆఫీసు సముదాయాల విషయానికొస్తే.. కార్పొరేట్ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్లెక్సీ సీటింగ్, హైబ్రిడ్ మోడల్ వంటి అంశాల్ని అంచనా వేస్తున్నాయి. ఉద్యోగులు ఎంత మంది ఆఫీసుకు రావాలి? ఎంతమంది ఇంటి నుంచి పని చేయాలి? తదితర అంశాల్ని అనేక ఐటీ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. దీనిపై స్పష్టత వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని సమాచారం.
* మొదటి వేవ్ రిటైల్ మాల్స్ యొక్క నికర నిర్వహణ ఆదాయాన్ని 2021 ఆర్థిక సంవత్సరంలో 50% వరకు తగ్గించింది. కాకపోతే, ద్వితీయార్థంలో రికవరీ ఆశించినంత స్థాయిలో జరగలేదు. దీంతో, రిటైల్ రంగం దారుణంగా దెబ్బతిన్నదని చెప్పొచ్చు. కరోనా సెకండ్ వేవ్‌లో అనేక కుటుంబాలు కొవిడ్ కోసం చేసిన ఖర్చు ప్రభావం రిటైల్ రంగం మీద పడింది. దీంతో 2022 ఆర్థిక సంవత్సరం చిల్లర వర్తక రంగం కోలుకునే అవకాశాలు లేకుండా చేసింది. పైగా, రానున్న రోజుల్లో షాపింగ్ మాళ్ల కంటే ఆన్‌లైన్ కొనుగోళ్లు ఎక్కువగా జరిగే అవకాశముంది. పైగా, సింగిల్ బ్రాండ్ షోరూముల వైపు ప్రజలు అధిక దృష్టి సారించే ఆస్కారముంది.
This website uses cookies.