Categories: LATEST UPDATES

స్టాంప్ డ్యూటీ తగ్గించాలి

కరోనా నేపథ్యంలో రెండు శాతం స్టాంప్ డ్యూటీని తగ్గించాలని క్రెడాయ్ బిల్డర్లు ముఖ్యమంత్రిని కోరారు. కొవిడ్ ఉపద్రవం నుంచి బయట పడాలంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ రంగానికి తగిన తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు క్రెడాయ్ నిర్మాణ సంఘం సీఎం ఉద్ధవ్ థాక్రేకు లేఖ రాశారు. గత ఆగస్టులో స్టాంప్ డ్యూటీని తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరగా.. సెప్టెంబరు నుంచి 2021 మార్చి దాకా 2-3 శాతం స్టాంప్ డ్యూటీని తగ్గించింది. మార్చి తర్వాత మహమ్మారి కారణంగా.. ఇళ్ల అమ్మకాలు గణనయంగా తగ్గుముఖం పట్టాయి. మే నెలలో ఆస్తి రిజిస్ట్రేషన్లు, స్టాంప్ డ్యూటీ దాదాపు 70 శాతం పడిపోయింది. అందుకే, స్టాంప్ డ్యూటీ తగ్గుదల గడువును పొడిగించాలని, అప్పుడే మళ్లీ నిర్మాణ రంగం గాడిలో పడుతుందని క్రెడాయ్ ఎంసీహెచ్ఐ అధ్యక్షుడు దీపక్ గోరాడియా తెలిపారు.

This website uses cookies.