* జాతీయ స్థాయిలో అభినందల వెల్లువ
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్క్ బిల్డర్స్ అధినేత గుమ్మి రాంరెడ్డి.. క్రెడాయ్ ప్రెసిడెంట్ (ఎలక్ట్)గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం గుజరాత్ సీఎం భూపేంద్రపాటిల్ ఆధ్వర్యంలో.. గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో జరిగిన క్రెడాయ్ నేషనల్ ‘ఛేంజ్ ఆఫ్ గార్డ్ సెర్మనీ 2025 కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. క్రెడాయ్ నేషనల్ రూపొందించిన ఐదు పాయింట్ల ఎజెండాను ముందుకు తీసుకెళతానని తెలిపారు. నిర్మాణ రంగంలో పారదర్శకత నెలకొల్పేందుకు కృషి చేస్తానని అన్నారు. తెలంగాణ నల్గొండ జిల్లాలోని చిట్యాల గ్రామానికి చెందిన ఆయన.. జాతీయ స్థాయిలో క్రెడాయ్ ప్రెసిడెంట్ (ఎలక్ట్) గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గర్వకారణమని చెప్పొచ్చు.
* 2008లో క్రెడాయ్ హైదరాబాద్‌లో చేరిన ఆయన మరుసటి ఏడాది ఈసీ మెంబర్ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో క్రెడాయ్ సెక్రటరీగా పని చేశారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఆయన క్రెడాయ్ తెలంగాణకు ప్రప్రథమ అధ్యక్షుడయ్యారు. సుమారు పదకొండు ఛాప్టర్లను ఏర్పాటు చేయడంలో ముఖ్యభూమికను పోషించారు. అంతేకాదు, క్రెడాయ్ అవార్డులను విజయవంతంగా నిర్వహించిన ఘనత ఆయనకే దక్కుతుంది. కేవలం తెలంగాణలోనే కాకుండా.. దక్షిణ హైదరాబాద్ స్థాయిలో క్రెడాయ్‌ను బలోపేతం చేయడంలో విశేషంగా కృషి చేశారు.
* మూడుసార్లు క్రెడాయ్ న్యాట్‌కాన్ ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్‌గా పని చేశారు. క్రెడాయ్ ఎక్స్‌ప్యాన్షన్ కమిటీ ఛైర్మన్‌గా నిర్మాణాత్మక పాత్ర పోషించారు. ఆయన ఆధ్వర్యంలో ఇజ్రాయేల్‌లో క్రెడాయ్ న్యాట్‌కాన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. జాతీయ స్థాయి నిర్మాణ రంగంలో ఆయన అంటే తెలియని బిల్డర్ లేరు. ప్రతిఒక్కరూ ప్రేమగా ఆయన్ని రామ్ అని పిలుస్తారు. అందుకే ఆయన 2021లో క్రెడాయ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. 2023లో క్రెడాయ్ నేషనల్ సెక్రటరీ.. ప్రస్తుతం క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ ఎలక్ట్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
క్రెడాయ్ సంఘంలో గుమ్మి రాంరెడ్డి ప్రస్థానం
2008లో క్రెడాయ్ హైదరాబాద్‌లో జాయిన్ అయ్యారు
2009లో హైదరాబాద్‌లో ఈసీ మెంబర్
2011లో జాయింట్ సక్రెటరీ క్రెడాయ్ హైదరాబాద్
2013 ఏపీ సెక్రటరీ
2015 తెలంగాణ ప్రథమ అధ్యక్షుడు
2019 క్రెడాయ్ తెలంగాణ ఛైర్మన్
* మూడుసార్లు క్రెడాయ్ న్యాట్‌కాన్ ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్
* క్రెడాయ్ ఎక్స్‌ప్యాన్షన్ కమిటీ ఛైర్మన్ సౌత్ ఇండియా
* జోనల్ సెక్రటరీ సౌతిండియా
2021 వైస్ ప్రెసిడెంట్ క్రెడాయ్ నేషనల్
2023 సెక్రటరీ క్రెడాయ్ నేషనల్
2025 ప్రెసిడెంట్ ఎలక్ట్