- నాణ్యమైన నిర్మాణాలు
లభిస్తాయనే నమ్మకం - రాష్ట్రం నలువైపుల్నుంచి సందర్శకులు
- ఈ షో.. నిర్మాణ రంగానికే దిక్సూచీ
క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో అంటే హైదరాబాద్లో ముందు నుంచీ ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. ఆరంభంలో ఈ షోను డిజైన్ చేసిన విధానమే ఇందుకు ప్రత్యేక కారణమని చెప్పొచ్చు. ప్రాపర్టీ షో అంటే కేవలం నిర్మాణ సంస్థల ప్రాజెక్టులను ప్రదర్శనకు పెట్టడమే కాదని ప్రాపర్టీ షో రూపకర్తలు తొలుత భావించారు. ఈ రంగం ఎదుర్కొనే సమస్యలను గుర్తించి.. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రాపర్టీ షో వేదిక మీదే ప్రత్యేకంగా చర్చల్ని జరుపుతారు. మార్కెట్లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆధునిక పరిజ్ఞానానికి సంబంధించిన సమాచారాన్ని డెవలపర్లకు అందజేస్తారు. గ్రీన్ ప్రాడక్ట్స్ ని పరిచయం చేస్తారు. బ్యాంకు రుణాలు, ప్రాజెక్టు ఫైనాన్స్ గురించి డెవలపర్లకు అవగాహన కల్పిస్తారు. మొత్తానికి, క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోకు విచ్చేస్తే.. నాణ్యమైన నిర్మాణాలు లభిస్తాయనే నమ్మకాన్ని కొనుగోలుదారులకు కలిగించడంలో క్రెడాయ్ హైదరాబాద్ విజయవంతమైంది. అంతేకాదు, ఈ ప్రదర్శన హైదరాబాద్ నిర్మాణ రంగానికి సంబంధించి ఓ దిక్సూచీ అని ప్రభుత్వ అధికారులు భావిస్తుండటం విశేషం.
క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో అదనపు ఆకర్షణ ఏమిటంటే.. రాష్ట్రం నలువైపుల నుంచి సందర్శకులు విచ్చేస్తారు. అంతేకాదు, పొరుగు రాష్ట్రాల్నుంచి ప్రత్యేకంగా ఈ షోకు వచ్చేవారి సంఖ్య తక్కువేం కాదు. అందుకే, ఇందులో స్టాళ్లను తీసుకునేందుకు పలువురు బడా డెవలపర్లు పోటీ పడతారు. ప్రాపర్టీ షోలను ఎంతో పకడ్బందీగా, పక్కా ప్రణాళికలతో క్రెడాయ్ హైదరాబాద్ నిర్వహిస్తుందనే పేరు గడించింది. సంస్థ నిర్వహించే ప్రచారం శైలి కూడా వినూత్నంగా కనిపిస్తుంది. నగరంలో ఇళ్లను కొనాలని భావించేవారిని విశేషంగా ఆకర్షిస్తుంది. మూడు రోజుల్లో.. కనీసం ఒక్కరోజు అయినా వీలు చేసుకుని.. ప్రాపర్టీ షోకు వెళ్లాలనే ఆలోచన రేకెత్తించేలా ఉండటం విశేషం. ప్రధానంగా, కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్లను ఎంచుకునే వారి సంఖ్య తక్కువేం కాదు. అంతెందుకు, క్రితంసారి జరిగిన ప్రాపర్టీ షోలో.. భార్యాభర్తలతో పాటు అటుఇటు కుటుంబ సభ్యులంతా కలిసికట్టుగా విచ్చేసి ఇళ్లను కొనుక్కున్నారు.
క్రెడాయ్ హైదరాబాద్ గత ప్రాపర్టీ షోకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ప్రాపర్టీ షోకు విచ్చేసిన వారిలో చాలామంది అక్కడికక్కడే డీల్స్ క్లోజ్ చేశారు. కొంతమంది బయ్యర్లు హైటెక్స్ నుంచి ప్రాజెక్టులనూ సందర్శించారు. గత ప్రాపర్టీ షోకు వచ్చిన అనూహ్యమైన స్పందన కారణంగానే పలు నిర్మాణ దిగ్గజాలు బడా స్టాళ్లను తీసుకునేందుకు ఆసక్తి చూపించాయి. ఈసారి, క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోకు.. అపర్ణా కన్‌స్ట్రక్షన్స్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుందని తెలిసింది. మరి, మిగతా స్పాన్సర్ల జాబితాలో.. పల్లాడియం ప్లస్ స్పాన్సర్‌గా జనప్రియ ఇంజినీర్స్ సిండికేట్ వ్యవహరిస్తోంది. సుమధుర, వాసవి గ్రూప్‌లు కలిసి పల్లాడియం స్పాన్సర్లుగా.. ప్లాటినం ప్లస్ స్పాన్సర్లుగా రాజపుష్ప, అరబిందో రియాల్టీలు వ్యవహరిస్తున్నాయి. ఏదీఏమైనా, హైదరాబాద్‌లో ఈ ఏడాది ఇళ్ల కొనుగోళ్ల పండగ షురూ అవ్వడంతో హోమ్ బయ్యర్లు, ఇన్వెస్టర్లు క్రెడాయ్ ప్రాపర్టీ షోకు అధిక సంఖ్యలో విచ్చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.