poulomi avante poulomi avante

111 జీవో ప్రభావం కోకాపేట్‌పై ప‌డదు

  • రియల్ ఎస్టేట్ గురుతో పౌలోమీ ఎస్టేట్స్ ఎండీ ప్రశాంత్ రావు
  • కోకాపేట్ గ‌ణ‌నీయంగా అభివృద్ధి చెందింది
  • ఈ స్థితికి రావడానికి ప‌దిహేనేళ్లు ప‌ట్టింది
  • 111 జీవో ప్రాంతాల అభివృద్ధికీ మరింత సమయం

 

ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేత వల్ల కోకాపేట్‌ వంటి ప్రాంతాలపై ప్రతికూల ప్రభావం ఉండదని పౌలోమీ ఎండీ ప్రశాంత్ రావు స్పష్టం చేశారు. ఈ ప్రాంతం ఓ విదేశీ న‌గ‌రం త‌ర‌హాలో అభివృద్ధి చెందుతోంద‌ని సంతోషం వ్య‌క్తం చేశారు. కోకాపేట్ ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితికి చేరుకునేందుకు దాదాపు ప‌దిహేనేళ్లు ప‌ట్టింద‌న్నారు. రాత్రికి రాత్రే అభివృద్ధి చెంద‌లేద‌నే విష‌యాన్ని గుర్తు చేశారు. ఇప్ప‌టికే ఇక్క‌డ‌ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ అభివృద్ధి చెందింద‌ని.. స్కూళ్లు, ఆస్పత్రులు, ఇతరత్రా సౌకర్యాలు వంటివి అందుబాటులోకి వ‌చ్చాయ‌న్నారు. త‌ర్వాతి రోజుల్లో ట్రిపుల్ వన్ జీవో పరిధిలోని ప్రాంతాలు కూడా ప్రీమియం కావొచ్చని కాక‌పోతే దానికి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు. హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ రంగం ప్రస్తుత పరిస్థితులు, పౌలోమీ కొత్త ప్రాజెక్టుల గురించి ఆయన ‘రియల్ ఎస్టేట్ గురు’తో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

కోకాపేట్‌లో 55 అంత‌స్తుల ప‌లాజో..

కోకాపేట్‌ గోల్డ‌న్ మైల్‌లో ప‌లాజో పేరుతో కొత్తగా ఓ ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టును ప్రారంభించాం. ప్ర‌భుత్వం వేలం వేసిన భూమి కావ‌డం వ‌ల్ల టైటిల్ క్రిస్ట‌ల్ క్లియ‌ర్‌గా ఉంది. సుమారు 2.3 ఎక‌రాల్లో ఈ ప్రాజెక్టు వ‌స్తోంది. మా ఈ ప‌లాజోకి ఒక‌వైపు ఓఆర్ఆర్‌, మ‌రోవైపు 80 ఫీట్‌ రోడ్డు, వెన‌క వైపు 3.5 ఎక‌రాల్లో ప్ర‌భుత్వ పార్కు వంటివి ఉన్నాయి. ఇంత బ‌డా ఆకాశ‌హ‌ర్మ్యాన్ని నిర్మించ‌డానికో ప్ర‌ధాన కార‌ణ‌ముంది. కోవిడ్ తర్వాత ప్రీమియం విల్లాలకు డిమాండ్ పెరిగింది. అయితే ల్యాండ్ రేట్లు బాగా పెరిగిన నేపథ్యంలో కోకాపేట వంటి ప్రాంతాల్లో విల్లాల్ని నిర్మించ‌డం క‌ష్ట‌మే. అందుకే, హైఎండ్ లార్జ్ సైజ్ అపార్ట్ మెంట్స్ నిర్మించాలనే నిర్ణ‌యానికొచ్చాం.

ఇంటర్నల్ క్లబ్ హౌజ్

55 అంతస్తుల్లో దాదాపు 204 మీటర్ల ఎత్తులో ప‌లాజోను నిర్మించాల‌నే నిర్ణ‌యానికొచ్చాం. ఈ ప్రాజెక్టులో వచ్చేవి కేవ‌లం 135 ఫ్లాట్లు మాత్ర‌మే. ఇందులో అన్నీ హైఎండ్ సౌకర్యాలే ఉంటాయి. రూఫ్ టాప్ పూల్ ఏర్పాటు చేస్తున్నాం. కింద ఉన్న మొదటి ఐదు అంతస్తుల్ని.. కేవలం గ్రీనరీ, క్లబ్ హౌస్ కోసమే కేటాయించాం. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఇంట‌ర్న‌ల్ క్ల‌బ్ హౌజ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో ఫ్లాట్ కొనుక్కునేవారు.. కాలానికి అతీతంగా ఆధునిక స‌దుపాయాల్ని ఆస్వాదించొచ్చు. కొన్నిసార్లు వ‌ర్షం ప‌డితే బ‌య‌ట జాగింగ్ చేయ‌లేం. చిన్నారులు బ‌య‌టికెళ్లి ఆడుకోలేరు. కానీ, ఇక్క‌డి క్ల‌బ్ హౌజ్‌లో.. జాగింగ్ చేసుకోవ‌చ్చు. చిన్నారులూ త‌మ‌కు న‌చ్చినంత సేపు ఎంచ‌క్కా ఆడుకోవ‌చ్చు. డబుల్ హైట్ బాల్కనీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. బాల్కనీల సీలింగ్ 24 అడుగులు ఉంటుంది. అందువల్ల అక్కడ కూర్చుంటే విల్లాలో ఉన్నంత‌ అనుభూతి కలుగుతుంది. ఆధునిక నిర్మాణ సాంకేతికతతో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నాం. నాలుగేళ్లలో పూర్తి చేయాల‌న్న ఉన్న‌త‌మైన ల‌క్ష్యంతో ముందుకెళుతున్నాం.

కోకాపేటే ఎందుకంటే..

కోకాపేట ప్రస్తుతం ప్రీమియం డెస్టినేషన్. ప్రీమియం లివింగ్ కావాలనుకునే వారంతా ఇక్క‌డికే వస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతం గ‌ణ‌నీయంగా అభివృద్ధి చెందింది. చుట్టుప‌క్క‌లే ఐటీ ఆఫీసులొస్తున్నాయి. భూమి రేట్లు చాలా పెరిగాయి. ఈ నేపథ్యంలో విల్లాల్ని క‌ట్టాలంటే ఎంతో ఖ‌రీదైన వ్య‌వ‌హారంగా మారింది. అందుకే, స్కై స్క్రేపర్ వైపు మొగ్గు చూపాం. పైగా కోకాపేటలోనే మాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటికే ఇక్కడ పౌలోమీ అరిస్టాస్, పౌలోమీ 90 వంటివి పూర్తి చేసి అప్పగించాం. ప్రస్తుతం పౌలోమీ అవంతే తుది దశలో ఉంది. 475 యూనిట్లు ఉన్న ఈ ప్రాజెక్టును వ‌చ్చే ఏడాదిక‌ల్లా పూర్తి చేస్తాం.

హైదరాబాద్లో వాస్తు తప్పనిసరి..

హైదరాబాద్ లో చాలామంది క్లయింట్లు వాస్తు కోసం చూస్తారు. అందువల్ల వారికి అనుగుణంగానే ప్రాజెక్టులు నిర్మించాల్సి ఉంటుంది. బాంబే, బెంగళూరు తరహాలో ఇక్కడ ప్రయోగాలు చేయలేం. ఇక్కడ మాస్టర్ బెడ్ రూం పెద్దగా ఉండాలి. లివింగ్ ఏరియా పెద్దగా ఉండాలి. అదే బెంగళూరులో అన్నీ కాంపాక్ట్ గా ఉంటాయి. అక్కడ స్పేస్ చాలా ప్రీమియం కావ‌డం వల్ల దానికి తగ్గట్టుగానే అక్కడ ప్రాజెక్టులు ఉంటాయి. మియాపూర్ లో ఓ పెద్ద ప్రాజెక్టు చేపట్టేందుకు ప్ర‌ణాళిక‌ల్ని ర‌చిస్తున్నాం.  ప్రస్తుతం మేం 7.5 మిలియన్ చదరపు అడుగుల రెసిడెన్షియల్ ప్రాజెక్టు, ఒక మిలియన్ చదరపు అడుగుల ఐటీ ప్రాజెక్టును క‌డుతున్నాం.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles