Categories: LATEST UPDATES

బుక్ రూముల‌ను డిజైన్ చేయాలి

క‌రోనా స‌మ‌యంలో డెవ‌ల‌ప‌ర్లంతా క‌లిసి బుక్ రూముల‌నూ డిజైన్ చేయాల‌ని గ‌వ‌ర్న‌ర్ డాక్ట‌ర్ త‌మిళ‌సై సౌంద‌ర‌రాజ‌న్ సూచించారు. గురువారం హైద‌రాబాద్‌లోని హెచ్ఐసీసీ నోవాటెల్‌లో క్రెడాయ్ తెలంగాణ నిర్వ‌హించిన క్రెడాయ్ స్టేట్‌కాన్ కాన్‌క్లేవ్ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ.. మ‌రికొన్ని రోజుల పాటు ప్యాండ‌మిక్ ఉంటుంది కాబ‌ట్టి, రెండు మ‌రియు ప‌డ‌క గ‌దుల ఫ్లాట్ల‌తో బాటు ప్ర‌త్యేకంగా బుక్ రూముల‌ను డిజైన్ చేయాల‌న్నారు. ఎందుకంటే, ప్యాండ‌మిక్ స‌మ‌యంలో బ‌య‌టికి వెళ్ల‌లేం కాబ‌ట్టి, ఇంట్లోనే కూర్చుని మంచి పుస్త‌కాలు చ‌దివేందుకు వీలు క‌లుగుతుంద‌న్నారు.

క్రెడాయ్ తెలంగాణకు ఆమె ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలిపారు. ముఖ్యంగా, క్రెడాయ్ సంస్థ క‌రోనా విపత్తులో రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో అనేక సామాజిక కార్య‌క్ర‌మాల్ని చేప‌ట్టింద‌న్నారు. క్రెడాయ్ తెలంగాణ‌లో ఇర‌వై ఛాప్ట‌ర్ల కంటే అధిక సంఖ్య‌లో పెరుగుతాయ‌న్న ఆశాభావాన్ని ఆమె వ్య‌క్తం చేశారు. క్రెడాయ్ యూత్ వింగ్ ఉండ‌టం ఈ సంఘానికి అతిపెద్ద బ‌ల‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. వీరే భ‌విష్య‌త్తులో ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ‌తార‌ని తెలిపారు. ఇక్క‌డికి చేరిన బిల్డ‌ర్లంద‌రూ దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధిలో ముఖ్య‌భూమిక పోషిస్తున్నార‌ని చెప్పారు. ఈ కార్యక్రమంలో మైహోమ్ గ్రూప్ ఛైర్మన్ జూపల్లి రామేశ్వరరావుకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 750 మందికి పైగా బిల్డర్లు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

This website uses cookies.