WARANGAL PROPERTY SHOW 2022
క్రెడాయ్ వరంగల్ అక్టోబరు 15, 16వ తేదీల్లో ప్రాపర్టీ షోను నిర్వహిస్తోంది. హన్మకొండలోని హంటర్ రోడ్డులో గల విష్ణుప్రియ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్న ఈ ప్రాపర్టీ షోకు భారీ సంఖ్యలో వినియోగదారుల్ని ఆకర్షించేందుకు ప్రణాళికలను రచించింది. ఈ సందర్భంగా క్రెడాయ్ ప్రెసిడెంట్- ఎలక్ట్ క్రెడాయ్ తెలంగాణ మాట్లాడుతూ.. ‘‘ఈ రెండవ ఎడిషన్ క్రెడాయ్ వరంగల్ ప్రోపర్టీ షో 2022 వద్ద బిల్డర్లు తమ ప్రాజెక్ట్‌లను అత్యుత్తమంగా ప్రదర్శించుకునే మహోన్నత అవకాశం కల్పిస్తుందనే నమ్మకంతో ఉన్నాము. చారిత్రక నగరం వరంగల్. ఇది అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఫ్యూచరిస్టిక్ హబ్‌గా నిలవడంతో పాటుగా రాష్ట్రంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటిగా నిలిచింది. ఈ నగరం ఇటీవలనే యునెస్కో గ్లోబల్ నెట్‌వర్క్‌ఆ ఆఫ్ లెర్నింగ్ సిటీగా గుర్తించబడింది. అత్యంత వేగవంతమైన అభివృద్ధి మరియు సంస్కరణల కోసం ఎంపిక చేయబడ్డ 13 స్మార్ట్ నగరాల్లో వరంగల్ ఒకటి. ఇక్కడ పలు అభివృద్ది పనులను నిర్వహించడానికి రాష్ట్రం శాయశక్తులా కృషి చేస్తుంది. దీనిలో భాగంగా 40 కిలోమీటర్ల స్మార్ట్ రోడ్‌ల నిర్మాణం, పర్యావరణ అనుకూల నివాసప్రాంతాలను తీర్చిదిద్దే కార్యక్రమాలు; గ్రీన్ అర్బనైజేషన్స్, చెరువుల సుందరీకరణ కార్యక్రమాలు, స్మార్ట్ సెంట్రల్ డిస్ట్రిక్ట్, విస్తరించిన వ్యాపార జిల్లా అభివృద్ధి వంటివి చేస్తోంది. ఈ కార్యక్రమాలు వరంగల్‌ను అత్యంత వేగవంతంగా వృద్ధి చెందే నగరంగా మార్చాయి. క్రెడాయ్ వరంగల్ ప్రోపర్టీ షో 2022 ఈసారి నగర వాసులు అత్యుత్తమ ప్రోపర్టీలను తమ కోసం గుర్తించేందుకు సహాయపడే రీతిలో నిర్వహిస్తున్నాం. ఈ ప్రోపర్టీ ద్వారా త్వరలో పెరుగనున్న ధరల భారం పడకుండా తమదైన ప్రాపర్టీని సొంతం చేసుకోవడం ద్వారా నగర వాసులు ప్రయోజనం పొందవచ్చు’’ అని అన్నారు.
క్రెడాయ్ వరంగల్ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ‘‘ వరంగల్ నగరంలో ప్రస్తుతం 84 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఈ మొత్తం ప్రాజెక్టుల విలువ 2,860 కోట్ల రూపాయల దాకా ఉంటుంది. దీనిలో ఏరియా బేస్డ్ డెవలప్‌మెంట్ (ఏబీడీ) ప్రాజెక్టులు (2707 కోట్ల రూపాయలు) ; నగర వ్యాప్త ప్రాజెక్టులు (153 కోట్ల రూపాయలు) ఉన్నాయి. ఇప్పటికే 576.13 కోట్ల రూపాయల విలువ కలిగిన ఎనిమిది ప్రాజెక్టులు పూర్తయ్యాయి. దాదాపు 612.45 కోట్ల రూపాయల విలువ కలిగిన 27 ప్రాజెక్టులకు వర్క్ ఆర్డర్స్ జారీ చేశారు. సుమారు 256.93 కోట్ల రూపాయల విలువ కలిగిన దాదాపుగా 10 టెండర్లు విడుదల చేశారు. దాదాపు 319.41 కోట్ల రూపాయల విలువ కలిగిన కనీసం 20 డీపీఆర్‌లు అనుమతించారు. మరో 488.03 కోట్ల రూపాయల విలువ కలిగిన 19 డీపీఆర్‌లు అనుమతి దశలో ఉన్నాయి’’ అని అన్నారు.
This website uses cookies.