క్రెడాయ్ వరంగల్ అక్టోబరు 15, 16వ తేదీల్లో ప్రాపర్టీ షోను నిర్వహిస్తోంది. హన్మకొండలోని హంటర్ రోడ్డులో గల విష్ణుప్రియ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్న ఈ ప్రాపర్టీ షోకు భారీ సంఖ్యలో వినియోగదారుల్ని ఆకర్షించేందుకు ప్రణాళికలను రచించింది. ఈ సందర్భంగా క్రెడాయ్ ప్రెసిడెంట్- ఎలక్ట్ క్రెడాయ్ తెలంగాణ మాట్లాడుతూ.. ‘‘ఈ రెండవ ఎడిషన్ క్రెడాయ్ వరంగల్ ప్రోపర్టీ షో 2022 వద్ద బిల్డర్లు తమ ప్రాజెక్ట్‌లను అత్యుత్తమంగా ప్రదర్శించుకునే మహోన్నత అవకాశం కల్పిస్తుందనే నమ్మకంతో ఉన్నాము. చారిత్రక నగరం వరంగల్. ఇది అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఫ్యూచరిస్టిక్ హబ్‌గా నిలవడంతో పాటుగా రాష్ట్రంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటిగా నిలిచింది. ఈ నగరం ఇటీవలనే యునెస్కో గ్లోబల్ నెట్‌వర్క్‌ఆ ఆఫ్ లెర్నింగ్ సిటీగా గుర్తించబడింది. అత్యంత వేగవంతమైన అభివృద్ధి మరియు సంస్కరణల కోసం ఎంపిక చేయబడ్డ 13 స్మార్ట్ నగరాల్లో వరంగల్ ఒకటి. ఇక్కడ పలు అభివృద్ది పనులను నిర్వహించడానికి రాష్ట్రం శాయశక్తులా కృషి చేస్తుంది. దీనిలో భాగంగా 40 కిలోమీటర్ల స్మార్ట్ రోడ్‌ల నిర్మాణం, పర్యావరణ అనుకూల నివాసప్రాంతాలను తీర్చిదిద్దే కార్యక్రమాలు; గ్రీన్ అర్బనైజేషన్స్, చెరువుల సుందరీకరణ కార్యక్రమాలు, స్మార్ట్ సెంట్రల్ డిస్ట్రిక్ట్, విస్తరించిన వ్యాపార జిల్లా అభివృద్ధి వంటివి చేస్తోంది. ఈ కార్యక్రమాలు వరంగల్‌ను అత్యంత వేగవంతంగా వృద్ధి చెందే నగరంగా మార్చాయి. క్రెడాయ్ వరంగల్ ప్రోపర్టీ షో 2022 ఈసారి నగర వాసులు అత్యుత్తమ ప్రోపర్టీలను తమ కోసం గుర్తించేందుకు సహాయపడే రీతిలో నిర్వహిస్తున్నాం. ఈ ప్రోపర్టీ ద్వారా త్వరలో పెరుగనున్న ధరల భారం పడకుండా తమదైన ప్రాపర్టీని సొంతం చేసుకోవడం ద్వారా నగర వాసులు ప్రయోజనం పొందవచ్చు’’ అని అన్నారు.
క్రెడాయ్ వరంగల్ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ‘‘ వరంగల్ నగరంలో ప్రస్తుతం 84 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఈ మొత్తం ప్రాజెక్టుల విలువ 2,860 కోట్ల రూపాయల దాకా ఉంటుంది. దీనిలో ఏరియా బేస్డ్ డెవలప్‌మెంట్ (ఏబీడీ) ప్రాజెక్టులు (2707 కోట్ల రూపాయలు) ; నగర వ్యాప్త ప్రాజెక్టులు (153 కోట్ల రూపాయలు) ఉన్నాయి. ఇప్పటికే 576.13 కోట్ల రూపాయల విలువ కలిగిన ఎనిమిది ప్రాజెక్టులు పూర్తయ్యాయి. దాదాపు 612.45 కోట్ల రూపాయల విలువ కలిగిన 27 ప్రాజెక్టులకు వర్క్ ఆర్డర్స్ జారీ చేశారు. సుమారు 256.93 కోట్ల రూపాయల విలువ కలిగిన దాదాపుగా 10 టెండర్లు విడుదల చేశారు. దాదాపు 319.41 కోట్ల రూపాయల విలువ కలిగిన కనీసం 20 డీపీఆర్‌లు అనుమతించారు. మరో 488.03 కోట్ల రూపాయల విలువ కలిగిన 19 డీపీఆర్‌లు అనుమతి దశలో ఉన్నాయి’’ అని అన్నారు.
క్రెడాయ్ వరంగల్ జనరల్ సెక్రటరీ జె మనోహర్ మాట్లాడుతూ ‘‘దేశవ్యాప్తంగా ఇక్కడి రియల్‌ఎస్టేట్ డెవలపర్లకు గుర్తింపు ఉంది. వరంగల్ స్మార్ట్‌సిటీ రెండు విభాగాలలో ప్రాజెక్టులను ఇక్కడ గుర్తించింది. అవి ఏరియా ఆధారిత డెవలప్‌మెంట్ మరియు నగర వ్యాప్త పరిష్కారాలు. ఈ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను ఏడు మాడ్యుల్స్ గా విభజించారు. వీటిలో 20 ప్రాజెక్టులు 66 సబ్ ప్రాజెక్టులు ఉంటాయి. క్రెడాయ్ వరంగల్ ప్రోపర్టీ షో 2022ను సరైన సమయంలో నిర్వహిస్తున్నాము. గృహ కొనుగోలుదారులు ఈ ప్రదర్శనలోని అత్యుత్తమ ప్రాజెక్టులను గుర్తించి , కొనుగోలు చేయడం ద్వారా ప్రయోజనం పొందగలరు’’ అని అన్నారు.
క్రెడాయ్ వరంగల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘క్రెడాయ్ వరంగల్ ప్రోపర్టీ షో లో 98 స్టాల్స్‌ను విభిన్న విభాగాలలో ఏర్పాటు చేయనున్నాము. డెవలపర్లు, ప్రొడక్ట్ వెండార్లు వరంగల్‌లో అత్యుత్తమ ప్రోపర్టీలను ఒకే చోట ప్రదర్శిస్తామన్నారు. క్రెడాయ్ వరంగల్ యూత్ వింగ్ కన్వీనర్ వరుణ్ అగర్వాల్ మాట్లాడుతూ ‘‘ రెండవ ఎడిషన్ క్రెడాయ్ వరంగల్ ప్రోపర్టీ షో 2022 అత్యధిక సంఖ్యలో వినియోగదారులను ఆకర్షించనుందని అంచనా. నెక్ట్స్ బిగ్ సిటీ వరంగల్ నగరంలో అత్యుత్తమ ప్రోపర్టీలు, ప్లాట్స్‌ను అన్వేషించేందుకు తగిన అవకాశాలను ఇది అందించనుంది. ఈ ప్రోపర్టీ షోను విస్తృతశ్రేణిలో ప్రచారం చేయడానికి ప్రణాళిక చేశాం. ప్రతి రోజూ 15వేల మందికి పైగా సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నామ’’న్నారు. క్రెడాయ్ తెలంగాణా వైస్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ మాట్లాడుతూ ‘‘ ఓ నగరం వేగవంతంగా అభివృద్ది చెందుతుందనడానికి అక్కడ అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ పరిశ్రమ కూడా ఓ కారణం. క్రెడాయ్ తెలంగాణాతో మేము రియల్ ఎస్టేట్ పరిశ్రమలో నూతన బెంచ్‌మార్క్‌ను ఏర్పాటుచేశాం. ఇక్కడ ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాలను వరంగల్ నగరాన్ని మదుపరులు, డెవలపర్లు, వ్యాపార యాత్రికులు, గృహ కొనుగోలుదారులకు మార్చాలనే లక్ష్యంతో అందిస్తున్నాం. భావి బృహత్ నగరం వరంగల్‌లో అతిపెద్ద ప్రోపర్టీ షో ను అన్వేషించడానికి ప్రతి ఒక్కరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు.
క్రెడాయ్ వరంగల్ ట్రెజరర్ ఎస్ అమలింగేశ్వరరావు మాట్లాడుతూ ‘‘తెలంగాణా యొక్క నగరాభివృద్ధిలో వేగం నూతన గృహ, వాణిజ్య నిర్మాణాలలో కనిపిస్తోన్న జోరు కారణంగానే కనిపిస్తోంది. ఈ ప్రోపర్టీలన్నీ కూడా వరంగల్ నగరంలో అతిపెద్ద, అత్యుత్తమ ప్రోపర్టీ షోలో భాగంగా ఉన్నాయి. చారిత్రక నగరం వరంగల్ నగరంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి, ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతాయనే నమ్మకంతో ఉన్నాం. ఈ ట్రై సిటీ, వరంగల్‌లో అత్యాధునిక ప్రోపర్టీలను పరీక్షించేందుకు క్రెడాయ్ వరంగల్ ప్రోపర్టీ షో 2022 అత్యుత్తమ ప్రాంగణంగా నిలువనుంది’’ అని అన్నారు.