GHR INFRA RECORD SALES IN HYDERABAD REALTY
కోకాపేట్ తర్వాత వచ్చే కొల్లూరులో జీహెచ్ఆర్ ఇన్‌ఫ్రా సంస్థ జీహెచ్ఆర్ కలిస్టో అనే అఫర్డబుల్ లగ్జరీ ప్రాజెక్టును నిర్మిస్తోంది. అన్నీ సంస్థల్లాగే జీహెచ్ఆర్ కూడా కడుతోంది.. ఇందులో స్పెషాలిటీ ఏముందని మీకు సందేహం రావొచ్చు. ఈ సంస్థ మార్చి నెలలో సుమారు 22 ఫ్లాట్లను విక్రయించి తన ప్రత్యేకతను చాటుకుంది. నిజానికి, కొల్లూరు వంటి ప్రాంతంలో.. అధిక శాతం బిల్డర్లకు నెలకు ఐదారు ఫ్లాట్లే అమ్ముడవుతున్నాయి. కానీ, జీహెచ్ఆర్ కలిస్టోలో మాత్రం 22 అమ్ముడయ్యాయి. ఇందుకు కారణాలేమిటని రెజ్ న్యూస్ విశ్లేషించగా.. పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
జీహెచ్ఆర్ ఇన్‌ఫ్రా సంస్థ ఈ ప్రాజెక్టు కోసం స్ట్రాటజిక్ లొకేషన్‌ను ఎంచుకుంది. కొల్లూరు సర్వీస్ రోడ్డు మీదుగా సులువుగా ఇక్కడికి చేరుకోవచ్చు. మరోవైపు గండిపేట్ రోడ్డు నుంచి కూడా రాకపోకల్ని సాగించొచ్చు. 8 ఎకరాల్లో కడుతున్నది పద్దెనిమిది అంతస్తులే. కేవలం 1190 ఫ్లాట్లనే నిర్మిస్తోంది. ఎకరానికి 300 వందల ఫ్లాట్లను నిర్మించినా సుమారు 2400 ఇళ్లను కట్టొచ్చు. కానీ, అంత అత్యాశకు వెళ్లకుండా కేవలం 1190 ఫ్లాట్లనే కట్టాలని నిర్ణయించుకుంది. దీంతో, ఇతర ప్రాజెక్టుల కంటే.. ఇందులో అధిక యూడీఎస్ స్థలం బయ్యర్లకు లభిస్తుంది.
అన్నింటి కంటే మించి.. ఫ్లాట్ ధరను అందుబాటులో ఉంది. టూ బెడ్రూమ్ ఫ్లాట్ బేస్ ప్రైస్.. కేవలం రూ.74 లక్షలుగా పెట్టింది. త్రీ బెడ్రూం ఫ్లాట్‌ను 89 లక్షలుగా ధర నిర్ణయించింది. ఇందులో వచ్చేవన్నీ 2, 2.5, త్రీ బెడ్‌రూం ఫ్లాట్లే కావడం గమనార్హం. కట్టేది కూడా కేవలం నాలుగు టవర్లే.
జీహెచ్ఆర్ కలిస్టో ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ పనుల్ని కూడా యమజోరుగా జరిపిస్తోంది. రియల్ మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా.. కన్‌స్ట్రక్షన్ వర్క్లో మంచి ప్రోగ్రెస్ చూపెడుతోంది. అందుకే, అధిక శాతం హోమ్ బయ్యర్లు ఈ ప్రాజెక్టులో ఫ్లాటును కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
This website uses cookies.