తెలంగాణ పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. దానకిషోర్.. కొంత కాలం నుంచి పెండింగ్ లో ఉన్న సమస్యకు మంచి పరిష్కారాన్ని చూపెట్టారు. ప్రభుత్వంలో ఉన్న కీలకమైన అధికారులు ఇలా ప్రో యాక్టివ్‌గా పని చేస్తే ప్రభుత్వానికీ మంచి పేరు వస్తుందని నిరూపించారు. ఆదివారం కురిసిన భారీ వర్షాల సమయంలో మాదాపూర్ ప్రాంతంలో పర్యటించిన ఆయన, వరదలకు గురైన రహదారులపై పరిస్థితిని పరిశీలించారు. వర్షం పడిన ప్రతీసారి ఈ రహదారిలో ట్రాఫిక్ రాకపోకలు కష్టమవుతోంది. దీంతో ప్రజలు నిత్య నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇదే అంశాన్ని అనేకసార్లు గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారానికి నోచుకోలేదు.
ఆదివారం సాయంత్రం పలు ప్రాంతాల్లో పర్యటించిన దానకిశోర్.. మాదాపూర్‌లోని ఈ ప్రాంతాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే అధికారుల్ని పిలిచి.. మాదాపూర్‌లోని నెక్టార్ గార్డెన్స్‌లో 30 లక్షల లీటర్ల సామర్థ్యంతో వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్‌ను నిర్మించాలని ఆదేశించారు. సంపు, అనుబంధ డ్రెయిన్లకు సుమారు 13 కోట్ల వ్యయం అవుతుందని, వారం రోజుల్లో పనులు చేపట్టి నెలన్నర రోజుల్లో పూర్తి చేయాలన్నారు. అటువంటి సంపుల నిర్మాణం కోసం ప్రభుత్వం 18 ప్రాంతాల్ని గుర్తించినట్లు దాన కిషోర్ తెలిపారు.
This website uses cookies.