Categories: LATEST UPDATES

లండన్ ఆఫీసు స్పేసుకు గిరాకీ

లండన్ లో ఆఫీసు స్పేసుకి గిరాకీ పెరిగింది. అద్దెలు పెద్దగా పెరగనప్పటికీ, ఉద్యోగాలు కార్యాలయాలకు రావడం ఆరంభించారు. వర్క్ స్పేస్ సంస్థకు 58 ప్రాపర్టీలు లండన్ లో ఉన్నాయి. గతేడాదితో పోల్చితే ఈసారి ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఆఫీసు స్థలం కోసం అడిగే కస్టమర్లు పెరిగారని వెల్లడించింది. వర్క్ స్పేస్ సంస్థ యజమాని గ్రాహం క్లెమెట్ మాట్లాడుతూ.. అనిశ్చితి మరికొంత కాలం కొనసాగుతుందని అయినప్పటికీ వ్యాపారాలు పుంజుకుంటాయని తెలిపారు. యువ ఉద్యోగులు ఇంట్లో కూర్చోవడం కంటే ఆఫీసు నుంచి పని చేయడానికి ఆసక్తి చూపిస్తారని వివరించారు.

This website uses cookies.