SITTING MLA'S FEAR OF LOOSING UPCOMING ELECTIONS
రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసే లే అవుట్స్ విషయంలో అదనపు కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆదివారం అదనపు కలెక్టర్లతో ప్రగతిభవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లే అవుట్లల్లో కమ్యూనిటీలకు కేటాయించిన కమ్యూనిటీ హాల్, ట్రాన్స్ ఫార్మర్స్, సబ్ స్టేషన్స్, వాటర్ ట్యాంకర్ తదితరాలకు కేటాయించిన స్థలాలను కూడా లే అవుట్ యజమానులు తర్వాత అమ్ముకుంటున్నారని.. వాటిని ముందే మున్సిపాలిటీల పేరు మీద రిజిస్టర్ చేయించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
* పట్టణ ప్రగతి పై మున్సిపాలిటీలు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. నర్సరీలు, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, పబ్లిక్ టాయిలెట్లు, వైకుంఠధామాలు సహా అన్ని అంశాల్లో ప్రతీ పట్టణానికి ఒక స్టేటస్ రిపోర్టు తయారు చేయాలన్నారు. పట్టణాల్లో మహిళలకు పబ్లిక్ టాయిలెట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథ అంతర్గతంగా పైప్ లైన్ల సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపారు. పట్టణాలల్లో పూర్తి స్థాయిలో ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేయాలని, దీని వల్ల విద్యుత్ బిల్లుల ఖర్చు తక్కువగా రావడం సంతోషకరమని సీఎం అన్నారు. నగరాలు, పట్టణాల్లో రోడ్ల విస్తరణకు సంబంధించి మాస్టర్ ప్లాన్ లో డైనమిక్ అప్డేషన్ చేయాలన్నారు. ప్రజా అవసరాల కోసం నగరాలు, పట్టణాల్లో ప్రభుత్వ ల్యాండ్ రికార్డ్స్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.
This website uses cookies.