అనధికార లేఔట్లపై ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్డీఏ) అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారం వేసిన లేఔట్లను ధ్వంసం చేస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం శేరి నరసన్నపాలెం వద్ద వేసిన రెండు అనధికార లేఔట్లను అధికారులు ధ్వంసం చేశారు. రోడ్లను ధ్వంసం చేయడంతోపాటు సర్వే రాళ్లను తొలగించారు. అలాగే నీటి పైపు లైన్లు, డ్రైనేజీలను కూడా ధ్వంసం చేశారు.
రాజధాని ప్రాంత అథారిటీ అనుమతి లేకుండా ప్లాట్లు విక్రయించడం శిక్షార్హమని ఏపీసీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ హెచ్చరించారు. రాజధాని ప్రాంతంలో చాలా ప్లాట్లు అనధికారం కావొచ్చని, అందువల్ల ప్రజలు వాటిన కొనుగోలు చేసే ముందు అన్నీ పరిశీలించుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించే వెంచర్లకు అనుమతులు ఇస్తామని పేర్కొన్నారు. ఎక్కడైనా అనధికార లేఔట్లు ఉంటే తమకు తెలియచేయాలని ప్రజలను కోరారు.
This website uses cookies.