అక్రమ నిర్మాణాల కూల్చివేత చర్యల్లో భాగంగా శుక్రవారం హెచ్ఎండిఏ, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్ చౌటుప్పల్ మున్సిపాలిటీ, జవహర్ నగర్ మున్సిపాలిటీల పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత చర్యలను చేపట్టాయి. జవహర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నాలుగు(4) అక్రమ నిర్మాణాలను, చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో రెండు(2) అక్రమ నిర్మాణాలను హెచ్ఎండిఎ, టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూల్చివేశారు. ఇప్పటివరకు 168 అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండిఎ, టాస్క్ ఫోర్స్ చర్యలు తీసుకున్నాయి.
* గత కొంతకాలం నుంచి జరుగుతున్న ఈ అక్రమ నిర్మాణాల్లో ప్రజల దృష్టిని ప్రధానంగా ఆకర్షించింది తూముకుంటలో సుచిరిండియా క్లబ్ హౌజ్ నిర్మాణమే. ఈ కట్టడమంతా పూర్తయ్యి.. ఎంతో చక్కగా ఈ నిర్మాణాన్ని ముస్తాబు చేశారంటే.. అది కూడా స్థానిక సంస్థ అనుమతి తీసుకోకుండా కట్టారంటే.. ఆ సంస్థ యజమానికెంత ధైర్యముండాలి. తానేం కట్టినా ప్రభుత్వం పట్టించుకోదని.. అధికారులు సొమ్ములిస్తే వదిలేస్తారనే అపోహలో ఉన్నందు వల్లే ఇంత ధైర్యంగా ఈ నిర్మాణం పూర్తి చేశారా? అని ప్రజలు అంటున్నారు.
చిన్న ఇల్లు కట్టుకుంటేనే కూల్చివేస్తున్న హెచ్ఎండీఏ బృందం.. ఈ సుచిరిండియా నిర్మించిన క్లబ్ హౌజ్‌ను నేలమట్టం చేస్తారా? లేక అమ్యామ్యాలు తీసుకుని వదిలేస్తారా? అని ప్రజలతో పాటు రియల్ ఎస్టేట్ రంగం ఆతృతతో. ఎదురు చూస్తోంది. ఎందుకంటే, ఒక్కసారి ఈ క్లబ్ హౌజ్‌ను అధికారులు వదిలేస్తే.. ఇలాగే అక్రమంగా క్లబ్ హౌజుల్ని కట్టిన అనేకమంది బిల్డర్లు కూడా ఇష్టం వచ్చినట్లు కట్టే అవకాశం లేకపోలేదు. కాబట్టి, హెచ్ఎండీఏ ప్రతిష్ఠ పెరగాలంటే.. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లను పట్టించుకోకుండా.. సుచిరిండియా క్లబ్‌హౌజ్‌ను నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
This website uses cookies.