Categories: LATEST UPDATES

నాలుగు అక్రమ నిర్మాణాల కూల్చివేత

* 149 అక్రమ నిర్మాణాలపై డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ చర్యలు

హైదరాబాద్ : డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్ సోమవారం ఘట్ కేసర్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చి వేసింది. హెచ్ఎండీఏ అధికారులు, టాస్క్ ఫోర్స్ టీమ్ యంత్రాంగం సోమవారం ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో విస్తృతంగా పర్యటించి నాలుగు అక్రమ నిర్మాణాలను కూల్చి వేసింది. ఎన్ఎఫ్ సి నగర్ (NFC Nagar)లో రెండు అక్రమ నిర్మాణాలను, శివారెడ్డి గూడలో ఒక అక్రమ నిర్మాణాన్ని, ఘట్కేసర్ లో మరొక అక్రమ నిర్మాణంపై టాస్క్ ఫోర్స్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఎ) పరిధిలోని మున్సిపాలిటీలలో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, హెచ్ఎండిఎ యంత్రాంగం 149 అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంది.

This website uses cookies.