అంతర్జాతీయ ఐఒటీ సంస్థ అయిన హొగర్ కంట్రోల్స్ నేడిక్కడ తన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ టచ్ ప్యానెల్ ప్రైమా+ నూతన సిరీస్ ను ఆవిష్కరించింది. ఈ సంస్థ 2019లోనే తన ఆర్ అండ్ డి, అసెంబ్లింగ్ యూనిట్ ను నెలకొల్పేందుకు హైదరాబాద్ ను ఎంచుకుంది. డిజైన్ ఫస్ట్ అప్రోచ్ తో, సమగ్ర స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్ లో భాగంగా హొగర్ టచ్ ప్యానెల్ సిరీస్ మూడు ఉత్పాదన రకాలను కలిగి ఉంటుంది.
రోజువారీ జీవితంలో ప్రజలు సాంకేతికతను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఐఒటి ప్రభావం ఇప్పటికే ప్రతీ ఒక్క వినియోగదారు ఇంట్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హొ గర్ కంట్రోల్స్ తన ప్రధాన ఉత్పాదన ప్రైమా+ స్మార్ట్ టచ్ ప్యానెల్స్ ద్వారా అనుసంధానిత జీవితాన్ని పునర్ నిర్వచిస్తోం ది. భారతదేశంలో 6000కు పైగా ప్రాజెక్టుల్లో.. 50,000 యూనిట్లను రికార్టు స్థాయిలో విక్రయించిన హొగర్ కంట్రోల్స్ హోమ్ ఆటోమేషన్ పరిశ్రమలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పింది. ఈ సంస్థ స్మార్ట్ టచ్ ప్యానెల్స్ రెట్రోఫిట్, వైర్లెస్ డిజైన్ తో వస్తాయి. ఇప్పటికే ఉన్న ఏ స్విచ్ బోర్డ్ పైనైనా సులువుగా ఫిట్ చేసుకోవచ్చు. వైరింగ్ లో ఇబ్బంది ఉండదు. రీమోడలింగ్ చేయనక్కర్లేదు.
సాధారణ లైట్లు, ఫ్యాన్లు, అప్లియెన్సెస్ ను స్మార్ట్ ఫిట్టింగ్స్ గా చేసేందుకు ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఆ విధంగా సాధారణ ఇంటిని స్మార్ట్ హోమ్ గా మారుస్తుంది. ప్రైమా+ అందంగా కనిపించేలా డిజైన్ చేయబడిన మాస్టర్ కంట్రోల్ ప్యానెల్స్. సమకాలీన జీవనశైలికి అ ద్దం పడుతాయి. హోగర్ విస్తృత శ్రేణి టచ్ ప్యానెల్స్ వివిధ డిజైన్లు, ఆప్షన్లు, కాంబినేషన్ల నుంచి ఎంచుకునే అవకాశాల ను అందిస్తాయి. ఈ పోర్ట్ ఫోలియో ఆరు, ఎనిమిది మరియు 12 గ్యాంగ్ బాక్స్ ఆప్షన్ల తో వస్తుంది. ఇందులో ఒక లైట్ డిమ్మర్, ఒక ఫ్యాన్ కంట్రోలర్, ఒక మోషన్ సెన్సర్ ఉంటాయి. రేపటి తరం స్మార్ట్ హోమ్ కంట్రోలర్ అనేది ఫ్యాన్లు, లైట్లు, కర్టెన్లు, షేడ్స్, బ్లైండ్స్, డిమ్మర్స్ లాంటి వివిధ రకాల ఉపకరణాలను కేవలం ఒక్క బటన్ టచ్ తో నిర్వహించుకోవడంలో తోడ్పడుతుంది.
2019లో ఈ సంస్థ దేశంలో తన కార్యకలాపాలకు హైదరాబాద్ ను ప్రధాన కేంద్రంగా ప్రకటించిన నాటి నుంచి హొగర్ కంట్రోల్స్ సుదీర్ఘ ప్రయాణం చేసింది. హైదరాబాద్ లో రూ.100 కోట్ల పెట్టుబడుల్ని ప్రప్రథమంగా ప్రకటించింది. మహమ్మారి సమయంలో ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదురైనప్పటికీ, హొగర్ కంట్రోల్స్ ఉప్పల్ లో అసెంబ్లింగ్ యూనిట్ ను నెలకొల్పడం ద్వారా తన కట్టుబాటును నెరవేర్చింది. ఈ కేంద్రంలో 100 మందికి పైగా పని చేస్తున్నారు. ఏడాదికి 6 లక్షల యూనిట్లను తయారు చేసే సామర్థ్యం దీనికి ఉంది.
ఈ సందర్భంగా హొగర్ కంట్రోల్స్ సీఈఓ విష్ణు రెడ్డి మాట్లాడుతూ, ‘‘స్మార్ట్ హోమ్స్ అనే పదానికి పూర్తిగా సరికొత్త అ ర్థాన్ని ఇస్తోంది స్మార్ట్ టెక్నాలజీ. గతంలో ఎన్నడూ లేని రీతిలో వినియోగదారులు సాంకేతికత పై ఆధారపడడం పెరిగి పోవడంతో, కనెక్టెడ్ హోమ్ ఉపకరణాలకు, సేవలకు, పరిష్కారాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ బాగా పెరిగి పోతోంది. హొగర్ కంట్రోల్స్ వినియోగదారుల ప్రాథమ్యాలను అర్థం చేసుకుంటుంది. తిరుగులేని విధంగా భద్రతను, అనుసంధాన జీవితాలను అందించే పరిష్కారాలను ప్రవేశపెడుతోంది’’ అని అన్నారు.
This website uses cookies.