ప్రముఖ నటి దోనల్ బిష్ట్
కలల ఇల్లు గురించి ఆలోచిస్తున్నారా? దోనల్ బిష్ట్ లాగానే మీరూ ఎంచుకోండి. అయితే, మేం ఆమె గతంలోకి వెళ్లాలని నిర్ణయించుకుని అడగ్గా.. తను మాకు పూర్తిగా చెప్పడం ఆరంభించింది. తన కుటుంబం అల్వార్‌లో తమ మొదటి ఇంటిని ఎలా కొనుగోలు చేసిందో గుర్తు చేసుకుంది.
“నేను రాజస్థాన్‌లో పుట్టాను. నా బాల్యంలో ఎక్కువ భాగం అక్కడే గడిచింది. నేను రాచరికపు ఒడిలో పెరిగాను. ఎందుకంటే ఆ రాష్ట్రం ప్రపంచంలోని కొన్ని ధనిక సంస్కృతులు మరియు వేడుకలకు నిలయం. మా టెర్రస్ మీదికి నెమలి వచ్చేది, అలంకరించబడిన ఏనుగులు మరియు ఒంటెలు తరచుగా అక్కడి వీధుల్లో కనిపించేవి. మరియు ఇంటి చుట్టూ కోటలు ఉంటాయి. ఎందుకంటే నా జన్మస్థలాన్ని కోటల నగరం అని పిలుస్తారు. మా నాన్నగారి వ్యాపారం కారణంగా ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లాం. ప్రస్తుతం ఎన్‌సీఆర్‌లో అత్యుత్తమ ప్రాపర్టీల్లో ఒకటైన ఖరీదైన ఆధునిక గృహంలో నివసిస్తున్నాం. నా స్నేహితులు దీనిని తరచుగా హాలిడే హోమ్ అని పిలుస్తారు.”
ఆమెకు ఉత్తరాఖండ్, చమోలిలో ఒక సొంత ఎస్టేట్ ఉంది. ఆమె ఇల్లు కొండపైన ఉంది. అక్కడే సంవత్సరం పొడవునా పండే పండ్లు మరియు కూరగాయలతో ఆ ప్రాంతమంతా అత్యంత సుందరంగా కనిపిస్తుంది. ”బాల్యంలో వేసవి సెలవులు అంటే ప్రకృతి ఒడిలో ఉన్న చమోలీకి వెళ్లి, మా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండేవారితో గడపటం ఎంతో ఆనందాన్నిచ్చేది. తల్లిదండ్రులు, తాతయ్యలతో ఎంతో ఉత్తమమైన జ్ఞాపకాలున్నాయి. ఎందుకంటే నా ఆస్తుల్లో వారే చాలా ప్రత్యేకమైన వారు. ప్రతి క్షణమూ ముఖ్యమైనది!” మొత్తానికి ఆమె పూర్తిగా ‘గ్రీన్ డెన్’ను ఇష్టపడుతుంది.
“నేను ప్రకృతిని ప్రేమిస్తున్నాను. ఇది నన్ను ఆలోచించడానికి, ఊపిరి పీల్చుకోవడానికి, మానసికంగా దృఢంగా ఉండటానికి మరియు సానుకూలంగా జీవించడానికి వీలు కల్పిస్తుంది. నేను ఇంటి చుట్టూ మొక్కలను ఏర్పాటు చేస్తాను. గ్రీన్ కార్పెట్ తరహాలో ఆ ప్రాంతాన్ని కప్పడానికి ఇష్టపడతాను. నా జీవనశైలి కాస్త క్లాసీగా ఉండాలని కోరుకుంటాను. మినమలిస్టిక్ గా ఉంటే చాలనిపిస్తుంది. మీరు ఇష్టపడే వ్యక్తులతో మీకు నచ్చిన స్థలంలో ఉంటే ఎప్పుడు స్వర్గంలో ఉన్నట్లే అనిపిస్తుంది.
నా డ్రీమ్ హోమ్ ఇలా..
నా కలల గృహం ఒక ప్రైవేట్ ద్వీపంలో ఉంటుంది. పైగా, అది నా వ్యక్తిత్వానికి పొడిగింపుగా కనిపిస్తుంది. ప్రశాంతంగా, నిర్మలంగా, అందరినీ ఆవరించే మరియు అల్లకల్లోలం లేకుండా ఉంటుంది. ఇది వివిధ మూలల్లో విభిన్న థీమ్‌లు మరియు రంగుల స్ప్లాష్‌ను కలిగి ఉండటం విశేషం. ప్రాథమికంగా ఇది ఒక రిట్రీట్ సెంటర్ మరియు వివిధ అవసరాలను తీర్చే ఎంటర్‌టైన్‌మెంట్ జోన్ అని చెప్పుకోవచ్చు. గోడలకు అద్భుతమైన కళాఖండాల్ని అలంకరించి ఉండాలి. అలంకరణ మొక్కలు తాజాదనాన్ని మరియు ప్రశాంతతను కలిగిస్తుంది. నా బాల్యాన్ని గుర్తు చేస్తూ మరియు ఒక వ్యక్తిగా నా పరివర్తనను గుర్తు చేస్తుంది. ఈ ఇంటిని సందర్శించే వారికి నా స్థలంగా కనిపిస్తుంది.