ఇదీ క్రికెటర్ యశస్వి జైపాల్ లగ్జరీ ఇల్లు
నిత్యం సందడిగా ఉండే ముంబై మహానగరం నడిబొడ్డున ఓ ఇల్లు ఉంది. యూరోపియన్ అధునాతనను సమకాలీన అంశాలతో మిళితం చేసి కనిపిస్తుంది. క్రికెటర్ యశస్వి జైపాల్ కు చెందిన ఆ ఇల్లు విలాసవంతానికి అర్థం చెబుతుంది. ఆ ఇంట్లోని ప్రతి మూలా శాశ్వతమైన ఆకర్షణ, ప్రాక్టికాలిటీ కనిపిస్తుంది. యశస్వి జీవన విధానాన్ని ప్రతిబింబించే స్థలం అని చూడగానే చెప్పేలా ఉంటుంది.
యశస్వి ఇంటి తలుపు దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఎక్కడ చూసిన ఎలాంటి తప్పిదాలూ లేని యూరోపియన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మోడ్రన్ లైన్స్, క్లాసిక్ కలయికతో కూడిన తలుపు ఆ నివాసపు సౌందర్య ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఆ ఇంటి డిజైనర్లు సంప్రదాయ డోర్ ఫ్రేమ్ లను పై భాగాన్ని ఎంతో చక్కగా, మృదువుగా రూపొందించారు. ప్రవేశద్వారం నుంచే యూరోపియన్ శైలిని ప్రదర్శించారు. అతిథులు లోపలకు అడుగు పెట్టగానే ముదురు నీలం రంగుంలో అలంకరించి ఉన్న ప్రవేశమార్గం ద్వారా స్వాగతం పలుకుతారు. అది ఎంతో అందంగా, అధునాతనంగా ఉంటుంది. లివింగ్ రూమ్ సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా ఎంతో స్టైల్ గా కనిపిస్తుంది. బౌకిల్ ఫాబ్రిక్ తో ప్రత్యేకంగా తయారు చేయించిన సోఫా, మార్బుల్ సెంటర్ టేబుల్ ఆహా అనిపిస్తాయి. టీవీ వెనకాల ఉన్న గోడకు బూడిద, తెలుపు రంగులో పెయింట్ చేయడంతో ఆ గది మొత్తానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంది.
లివింగ్ ఏరియా నుంచి అలా ఓపెన్ కిచెన్ లోకి వెళితే.. వైట్ క్వార్ట్జ్ కౌంటర్ టాప్స్, స్టాట్యురియో మార్బుల్ తో అత్యద్భుతంగా రూపొందించిన కేబినెట్లు కనిపిస్తాయి. చక్కని పాలరాతి స్తంభాలతో కూడిన పీ ది రెసిస్టెన్స్ అనే అర్ధ వృత్తాకార సర్వింగ్ కౌంటర్ అత్యద్భుతమైన కళాఖండం అనడంలో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు. ఇంట్లో అలా వెళ్తున్నప్పుడు ప్రతిచోటా ఎంతో ప్రశాంతత కనిపిస్తుంది. ముదురు నీలం గోడలు, మినిమలిస్టిక్ డెకర్ తో ఉన్న మాస్టర్ బెడ్ రూమ్ అంతులేని అనుభూతిని కలిగిస్తుంది. అటాచ్డ్ బాత్ టబ్ ప్రాంతం సముద్ర నీలం టైల్స్, టెర్రాజో ఫినిషింగ్ కలిగి ఉండటంతో కనువిందు చేస్తుంది. మొత్తానికి అది విశ్రాంతి తీసుకునే అందమైన ప్రదేశం.
ఇక ప్రతి గదిలో లైటింగ్ డామినేట్ కాకుండా ఉండేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి గది వెచ్చని హాయి గొలిపే వాతావరణం అందించేలా డిజైన్ చేశారు. ఇంగ్లిష్ ఫైర్ ప్లేసెస్ స్పూర్తిగా బార్ ప్రాంతం నుంచి మూడో బెడ్ రూమ్ వరకు పొడవైన అద్దాన్ని అమర్చారు. ఇంట్లోని ప్రతి అంశమూ ఆ ఇంటి యజమాని వ్యక్తిగత అభిరుచి, ఆచరణాత్మక అవసరాలు ప్రతిబింబిస్తుంది. శైలి, కార్యాచరణ మధ్య సామరస్యాన్ని సాధించేలా యశస్వి ఇల్లు ఉంటుంది. ఈ విలాసవంతమైన ముంబై నివాసంలో ఐరోపా సొగసు, ఆధునిక సౌలభ్యం కలిసి ఉంటాయి. అంతేకాదు.. ఆ ఇంటి యజమాని కోసం ఓ చక్కని అభయారణ్యంగా ఆ నివాసం కలకాలం నిలిచి ఉంటుంది.