అపార్ట్ మెంట్లకు సంబంధించిన మెయింటనెన్స్ చార్జీలను ఆయా యూనిట్ల కొనుగోలుదారులంతా చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆక్యుపెన్సీతో సంబంధం లేకుండా ఫ్లాట్ కొనుగోలు చేసినప్పటి నుంచి నిర్వహణ చార్జీలు చెల్లించాలని తేల్చి చెప్పింది. అమ్ముడుపోని ఫ్లాట్ నిర్వహణ చార్జీలను వాటిని విక్రయించే వరకు డెవలపర్ భరించాలని పేర్కొంది. మెయింటనెన్స్ చార్జీలను నిర్ధారించి, ఇళ్ల కొనుగోలుదారుల నుంచి తీసుకునేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఈ చార్జీలను నిర్ధారించడానికి ఎలాంటి ఫార్ములా లేదని పేర్కొంది. కాగా, 2016 రియల్ ఎస్టేట్ చట్టం ప్రకారం ప్రతి ఇంటి యజమాని హౌసింగ్ సొసైటీలో వారి యూనిట్ నిర్వహణ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.
This website uses cookies.