సూర్యకిరణాలు నేరుగా ఇంట్లోకి పడుతుంటే ఏం చేస్తాం? తలుపులు, కిటికీలు మూసేస్తే.. ఇల్లంతా చీకటిగా మారుతుంది. మరి, కర్టెన్లు చూస్తేనేమో పాత ఫ్యాషన్ అయిపోయింది. మరి, ఇందుకు మన ముందున్న ఏకైక ప్రత్యామ్నాయమే.. బ్లైండ్స్!
ఇంట్లోకి ఎండ రానీయకుండా కర్టెన్ పేరుతో ఏదో ఒక బట్ట వాడే రోజులు కావివి. ఇల్లంతా అందంగా కనబడేందుకు ఖర్చుకేమాత్రం వెనకడుగు వేయం. కాకపోతే రంగురంగుల ఫ్యాబ్రిక్లు, రకరకాల డిజైన్లు, వందల కొద్దీ ప్యాటర్న్ లతో ప్రతిఒక్కర్ని బ్లైండ్ల్స్ ఆహ్వానిస్తున్నాయి.
వెనీషియన్, వెర్టికల్, రోలింగ్.. ఇవి కొన్ని బ్లైండ్ల రకాలు. ఇందులో హారిజాంటల్ స్ట్రిప్ట్ కలది వెనీషియన్ బ్లైండ్. అల్యూమినియం, కలపతో రూపొందించినవి రెండు రకాలు. మొదటి రకానికి చదరపు అడుక్కీ కనీసం రూ.30 నుంచి రూ.120 దాకా పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా ఆఫీసుల్లో వాడే రకాల కోసం ఎంతలేదన్నా చదరపు అడుక్కీ రూ.60 దాకా పెట్టాల్సి ఉంటుంది. కాస్త ఆధునిక డిజైన్లవి కావాలంటే.. చదరపు అడుక్కీ రూ.250 దాకా పెట్టక తప్పదు.
పోష్ ఇళ్లల్లో అతిసుందరంగా కనిపించే కిటికీలను చూసి బ్లైండ్లు కేవలం డబ్బున్న వారికే పరిమితమని అనుకోవద్దు. అతి సామాన్యుల నుంచి అపర కుబేరుల వరకూ ప్రతిఒక్కరికీ సరిపోయే రకాలు హైదరాబాద్తో పాటు ప్రతి పట్టణంలో లభిస్తున్నాయి. కలపతో రూపొందించే బ్లైండ్ కోసం ఎంతలేదన్నా చదరపు అడుక్కీ కనీసం రూ.300 దాకా పెట్టాల్సి ఉంటుంది. రోలింగ్ బ్లైండ్లకు ఖరీదైన ఫ్యాబ్రిక్ జత చేసి రూపొందించినవే రోమన్ రకాల బ్లైండ్లు. హాల్, బెడ్ రూములకు ఇవి చక్కగా సరిపోతాయి. నగరాల్లో భవనాల మధ్య ఇల్లు లేదా ఫ్లాట్ ఉన్నట్లయితే ఇంట్లోకి వెలుతురు పెద్దగా రాకపోవచ్చు.. ఇలాంటి సమస్యకు పరిష్కారం చూపెట్టది.. చిక్ బ్లైండ్. మీకెంత వెలుతురు కావాలో అంతే ఇవ్వడం దీన్ని ప్రత్యేకత.
ఆధునిక బ్లైండ్ కొంటున్నారా? వీటిని కొనడానికి షోరూముకు వెళ్లినప్పుడు మీ అవసరాలేమిటో తెలుసుకోండి. ఎండను నిరోధించడంతో పాటు ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి ఎంచుకునే బ్లైండ్ కోసం మీరెంత బడ్జెట్ పెట్టాలని అనుకుంటున్నారు? అనే విషయంపై ముందుగా ఒక అవగాహనకు రావాలి.
This website uses cookies.