quartz stone slabs and tiles by mahi granites
మీరు మీ ఇల్లు కానీ కార్యాలయాన్ని కానీ ఆధునికంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారా? అయితే, మీరు కాలుష్యరహితమైన సహజసిద్ధ క్వార్ట్జ్ ఆధారిత స్టోన్ శ్లాబుల్ని ఎంచుకోవాల్సిందే. ఎందుకంటే, ఇంటిని కాస్త భిన్నంగా తీర్చిదిద్దాలని భావించేవారికి ఈ గ్రానైట్ శ్లాబులు, టైళ్లు మార్కెట్లో లభిస్తున్నాయి. వీటిని నగరానికి చెందిన మహీ గ్రానైట్స్ మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ రకాలకు క్రిస్టల్లోస్ అని నామకరణం చేసింది. స్టోన్ ఇండస్ట్రీలో దాదాపు పాతికేళ్లకు పైగా అనుభవం గల కృష్ణారావు క్రిస్టల్లోస్ బ్రాండ్‌కు శ్రీకారం చుట్టారు.
భారతదేశం నుంచి గ్రానైట్‌ను విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారాన్ని ఆరంభించిన తొలి వ్యాపారుల్లో ఆయన ఒకరు. సహజమైన గ్రానైట్ యొక్క స్వాభావిక అందం మరియు మన్నికను కనిపించేలా ఈ బ్రాండ్ ఉత్పత్తులు కనిపిస్తాయి. ఇందుకోసం నైపుణ్యం కలిగిన హస్తకళాకారుల బృందం పని చేస్తుంది. ఆధునిక సాంకేతికతతో కలిపి, అంచనాలను మించే అసాధారణమైన ఉత్పత్తుల్ని మహి గ్రానైట్స్ ఉత్పత్తి చేయడం ప్రారంభించింది.
This website uses cookies.