Categories: LATEST UPDATES

కార్మికులకు రూ.1.2 కోట్ల పంపిణీ?

కొవిడ్ వల్ల ఉపాధిని కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు కార్మిక శాఖ తాజాగా సుమారు రూ.1.2 కోట్లను అందజేసింది. ఈ శాఖ వద్ద నమోదైన దాదాపు పన్నెండు వేల మంది కార్మికులకు వెయ్యి రూపాయలు చొప్పున అందించింది. మే మరియు జూన్ నెలలో కరోనా వల్ల ఉపాధి కోల్పోవడంతో కార్మిక శాఖ నేరుగా వారి ఖాతాల్లోనే వెయ్యి రూపాయలు చొప్పున జమ చేసింది. జమ్మూ కాశ్మీర్ లోని ఉదంపూర్లో పని చేసే భవన నిర్మాణ కార్మికులకు అక్కడి కార్మిక శాఖ ఆపన్నహస్తం అందించింది. మరి, నిర్మాణ కార్యకలాపాలు ముమ్మరంగా జరిగే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కార్మిక శాఖ ఇలా భవన నిర్మాణ కార్మికుల్ని ఎందుకు ఆదుకోవడం లేదు? పైగా, తెలంగాణలో హైదరాబాద్తో సహా అనేక పట్టణాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఎక్కువగా పని చేస్తుంటారు. వీరికేమో రెండు నెలల్నుంచి ఉపాధి దొరకడం గగనమవుతోంది. మరి, ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల కార్మిక శాఖ భవన నిర్మాణ కార్మికులకు ఆపన్నహస్తం అందించేందుకు ప్రణాళికల్ని రచిస్తాయా? లేదా?

This website uses cookies.