Categories: TOP STORIES

ప్రవాసులు కొనేది ఆ నగరాల్లోనే!

బెంగళూరు, పుణే, చెన్నై నగరాల్లోని రూ.1.5–2.5 కోట్ల మధ్య ధర ఉండే గృహాలను కొనుగోలు చేసేందుకు ప్రవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో అయితే చంఢీఘడ్, కోచి, సూరత్ వంటి పట్టణాలపై మక్కువ చూపిస్తున్నారు. 41 శాతం మంది రెండో ఇంటిని తాము ఉండేందుకు కొనుగోలు చేస్తుండగా.. 53 శాతం మంది ఎత్తయిన ప్రాంతాలలో ఇళ్ల కోసం వెతుకుతున్నారు. 65 శాతం మంది వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాస్ల నేపథ్యంలో పెద్ద సైజు ఇళ్లపై మక్కువ చూపిస్తుంటే.. 68 శాతం మంది శివారు ప్రాంతాలలో కొనుగోళ్లకు ఇష్టపడుతున్నారు.

60 శాతానికి పెరిగిన ఆన్లైన్..

ప్రాపర్టీలను వెతకడం నుంచి మొదలుపెడితే డాక్యుమెంటేషన్, న్యాయ సలహా, చెల్లింపుల వరకు ప్రతీ దశలోనూ కొనుగోలుదారులు డిజిటల్ మాధ్యమాన్ని వినియోగిస్తున్నారు. కరోనా కంటే ముందు ప్రాపర్టీ కొనుగోలు ప్రక్రియలో ఆన్లైన్ వాటా 39 శాతంగా ఉండగా.. ఇప్పుడది 60 శాతానికి పెరిగింది. పటిష్టమైన ఆన్లైన్ మార్కెటింగ్ బృందం, సోషల్ మీడియా వేదికలు ఉన్న డెవలపర్లు మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో నిలబడగలుగుతారు.

– రూ.45 లక్షలు, అంతకంటే తక్కువ ధర ఉండే అఫర్డబుల్ హౌసింగ్ కొనుగోళ్లకు కస్టమర్లు అనాసక్తిగా ఉండటానికి ప్రధాన కారణం ఆ విభాగం కొనుగోలుదారుల ఆర్ధిక పరిస్థితులపై కరోనా ప్రభావం చూపించడమేనని అనరాక్ ప్రాపర్టీ చైర్మన్ అనూజ్ పురీ తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావటం, అన్ని రంగాలలో ఆర్ధిక కార్యకలాపాలు పుంజుకోవటం, ఉద్యోగ భర్తీలు పెరిగితే అందుబాటు గృహాలకు మళ్లీ గిరాకీ పెరుగుతుందని చెప్పారు

This website uses cookies.