Categories: LATEST UPDATES

ప్రణీత్ గ్రూప్.. లుక్ ఈస్ట్

    • పోచారంలో ప్రణీత్ ప్రణవ్ ఎక్స్పీరియా

మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టిన లుక్ ఈస్ట్ పాలసీ నుంచి స్ఫూర్తి పొందిన ప్రణీత్ గ్రూప్.. తాజాగా ఈస్ట్ హైదరాబాద్లో సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. పోచారం చేరువలోని అన్నోజిగూడలో చేపడుతున్న ప్రణీత్ ప్రణవ్ ఎక్స్ పీరియా అని పేరు పెట్టిన ఈ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజను ఇటీవల నిర్వహించింది. ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ప్రణీత్ ప్రణవ్ ఎక్స్ పీరియాలో దాదాపు 750 ఫ్లాట్లను నిర్మించడానికి సంస్థ ప్రణాళికల్ని రచించింది. క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ మరియు ఔట్ డోర్ గేమింగ్స్ తో పాటు ఆధునిక సదుపాయాల్ని ఇందులో పొందుపరుస్తామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ కామరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవీఎస్ఎన్ నరసింగరావు, పాతపాటి ఆంజనేయులు, సప్పిడి నర్సిరెడ్డి, బక్కిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఆదిత్య కామరాజు, సప్పిడి దినేష్ రెడ్డి, మాధవరం సందీప్ రావు, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

This website uses cookies.