రెజ్ న్యూస్, హైదరాబాద్: అక్రమ నిర్మాణాల కూల్చివేతలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) నిరంతరంగా కొనసాగిస్తున్నది. మంగళవారం సంగారెడ్డి జిల్లా, జిన్నారం మండలం, ఐడిఏ బొల్లారం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 280లో హెచ్ఎండిఏకి చెందిన భూముల్లో అక్రమ నిర్మాణాలను హెచ్ఎండిఏ యంత్రాంగం నేలమట్టం చేసింది.
హెచ్ఎండిఏ యాజమాన్య హక్కులు కలిగిన ఐడిఏ బొల్లారం సర్వే నెంబర్ 280 పరిధిలో కొందరు అక్రమంగా ఇంటి నిర్మాణాలు జరిపేందుకు చేస్తున్న ప్రయత్నాలను హెచ్ఎండిఏ గుర్తించి వెంటనే కార్యాచరణ చేపట్టింది. మంగళవారం హెచ్ఎండిఏ ఎస్టేట్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు బేస్ మెంట్ స్థాయిలో ఉన్న మూడు (3) నిర్మాణాలతో పాటు పూర్తి అయిన మూడు (3) గదులను నేలమట్టం చేశారు.
హెచ్ఎండిఏ ఆధీనంలో ఉన్న భూముల పై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతున్నప్పటికీ కొన్నిచోట్ల కొందరు స్థానిక ప్రజలను ప్రలోభపెట్టి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నట్లుగా హెచ్ఎండిఏ అధికారులు గుర్తించారు. హెచ్ఎండిఏ స్థలాలు లేదా భూములపై సంపూర్ణ హక్కులు హెచ్ఎండిఏకే ఉంటాయని, అక్రమ నిర్మాణాలు చేపట్టి ఆర్థికంగా నష్టపోవద్దని హెచ్ఎండి అధికారులు సామాన్య ప్రజానీకానికి సూచించారు.
This website uses cookies.