Categories: AREA PROFILE

ప‌ది శాతం సొమ్ము కడితే హ‌ర్మోనీలో ఫ్లాట్ సొంతం

  • ప్రగతినగర్ లో ల‌గ్జ‌రీ ప్రాజెక్టు
  • మెరుగైన క‌మ్యూనిటీ ఇది!
  • అందుకే కొనుగోలుదారులు ఆస‌క్తి

ప్రముఖ నిర్మాణ కంపెనీ రాంకీ.. ప్రగతి నగర్ లో విలాసవంతమైన ప్రాజెక్టు లాంచ్ చేసింది. 8.1 ఎకరాల స్థలంలో ఏడు టవర్లలో ఆధునిక జీవనశైలికి తగిన విధంగా విస్తృతమైన సౌకర్యాలు, అద్భుతమైన ల్యాండ్ స్కేపింగ్, రెండు విశాలమైన క్లబ్ హౌస్ లతో రాంకీ వన్ హ‌ర్మోనీ పేరుతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. రెండు బేస్ మెంట్లు, గ్రౌండ్, 9 అంతస్తులతో దీనిని నిర్మిస్తున్నారు. 2, 3 బీహెచ్ కే లలో 803 ప్లాట్లు అందుబాటులో ఉన్న ఈ ప్రాజెక్టు 2023 డిసెంబర్ నాటికి పూర్తవుతుంది. ఇందులో ఫ్లాట్ కొనేవారు తొలుత ప‌ది శాతం సొమ్ము క‌డితే చాలు.. మిగ‌తా 90 శాతాన్ని గృహ‌ప్ర‌వేశం స‌మ‌యంలో క‌డితే స‌రిపోతుంది. ఈ ప్రీ ఈఎంఐ స్కీము వ‌ల్ల కొనుగోలుదారులు హార్మోనీలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు.

నగరంలోని ప్రముఖ విద్యా సంస్థలు, మాల్స్, ఐటీ హబ్, ఆస్పత్రులకు చక్కని కనెక్టివిటీని కలిగి ఉండటం ఈ ప్రాజెక్టుకు అదనపు బలం. వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ కాలేజీ 4.4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక జేఎన్టీయూ 5 కిలోమీటర్లు.. 4.1 కిలోమీటర్లు వెళితే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వస్తుంది. 5.7 కిలోమీటర్ల దూరంలో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ చేరుకోవచ్చు. రెమెడి ఆస్పత్రి 5.8 కిలోమీటర్ల దూరంలో, ఉషా ముళ్లపూడి ఆసత్రి 6.1 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

  • ఏషియన్ జీపీఆర్, మంజీరా, ఫోరం వంటి మాళ్లు 6 కిలోమీటర్ల లోపే ఉన్నాయి.
  • అరకిలోమీటర్ దూరంలోనే మోర్ సూపర్ మార్కెట్ ఉంది.

మోడ్ర‌న్ ఎమినిటీస్ సూప‌ర్‌..

ఈ ప్రాజెక్టులో సౌకర్యాలు సైతం భారీగానే ఉన్నాయి. టెన్నిస్, హాఫ్ బాస్కెట్ బాల్ కోర్టులు, ఔట్ డోర్ జిమ్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్. సెంట్రల్ కోర్ట్ యార్డ్, ఓపెన్ ఎయిర్ థియేటర్, పిల్లల ఆటస్థలం, ప్రతి బ్లాక్ కూ ప్రత్యేక ఎంట్రీ, ల్యాండ్ స్కేప్ గార్డెన్స్, కారు వాషింగ్ సౌకర్యం, లాండ్రీ, సీనియర్ సిటిజన్స్ జోన్, ఏసీ జిమ్, బిజినెస్ లాంజ్, ఇండోర్ గేమ్స్, మెడిటేషన్, యోగా రూం, గెస్ట్ రూం, మల్టీ పర్పస్ హాల్.. ఇంకా మరెన్నో చక్కని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రగతినగర్ ప్రాంతంలో సరికొత్త జీవితాన్ని కోరుకునేవారికి రాంకీ హర్మనీ చక్కని ఆప్షన్ అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.

This website uses cookies.