Categories: PROJECT ANALYSIS

ఆహ్లాదకర జీవితం.. వాసవి నందనం

  • సుచిత్ర సర్కిల్ సమీపంలో సూపర్ ప్రాజెక్టు
  • రూ.55 లక్షల నుంచి ఫ్లాట్ ధర మొదలు

ఆహ్లాదకరమైన వాతావరణంలో కాస్త అందుబాటు ధరలో ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే, సుచిత్ర సర్కిల్ లో వాసవి నందనం అపార్ట్ మెంట్ మీకు సరైన ఎంపిక. 4.18 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక జీవనశైలికి అనుగుణంగా వాసవీ గ్రూప్ ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. మొత్తం 5 టవర్లలో 2, 3 బీహెచ్ కే ఫ్లాట్లు 1235-2010 చదరపు అడుగుల పరిమాణంలో 420 యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి టవర్ లో 10 ఫ్లోర్లు ఉంటాయి. 1235 చ దరపు అడుగుల్లో 2 బీహెచ్ కే, 1560-2010 చదరపు అడుగుల్లో 3 బీహెచ్ కే ఫ్లాట్లు డిజైన్ చేశారు. వినోద కార్యకలాపాల కోసం జీ+3 అంతస్తుల్లో 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో చక్కని క్లబ్ హౌస్ కూడా నిర్మిస్తున్నారు.

రెరా అనుమతి కలిగిన ఈ ప్రాజెక్టులో మల్టీపర్పస్ హాల్, ఎంట్రన్స్ లాబీ, గ్రాసరీ షాప్, మీటర్ రూం, పిల్లల ఆటస్థలం, మురుగునీటి శుద్ధి ప్లాంటు, యోగా రూం, 24 గంటల నీటి సరఫరా, ల్యాండ్ స్కేపింగ్, ట్రీ ప్లాంటింగ్, ఇండోర్ గేమ్స్, ఏంఫిథియేటర్, రిసీవింగ్ స్టేషన్, సబ్ స్టేషన్, క్లబ్ రూఫ్ టాప్, సెక్యూరిటీ కేబిన్, మినీ థియటర్, ఇంకుడుగుంతలు, కమ్యూనిటీ బిల్డింగ్స్, క్లబ్ హౌస్, వరదనీటి పారుదల వ్యవస్థ, వేస్ట్ మేనేజ్ మెంట్, రెస్టారెంట్స్, బాస్కెట్ బాల్ కోర్టు, జిమ్నాజియం, స్విమ్మింగ్ పూల్, స్కేటింగ్ రింక్, క్రికెట్ పిచ్, బిజినెస్ సెంటర్ వంటి ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.
లోకేషన్ పరంగా కూడా ఈ ప్రాజెక్టు మంచి అనువైన ప్రదేశంలో ఉంది. సుచిత్ర సర్కిల్ కు అత్యంత సమీపంలో ఉండటం వల్ల మూడు కిలోమీటర్ల డ్రైవ్ తో జీడిమెట్ల వెళ్లొచ్చు. అలాగే పలు ఆస్పత్రులు, మాల్స్ కూడా చాలా సమీపంలోనే ఉన్నాయి. పది నిమిషాలు డ్రైవ్ చేస్తే బోయినపల్లి, బాలానగర్ వంటి ప్రాంతాలకు చేరుకోవచ్చు. జూబ్లీ బస్ స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఓఆర్ఆర్, ప్యారడైజ్ లు 15 నిమిషాల డ్రైవ్ దూరంలో ఉన్నాయి. 2025 డిసెంబర్ నాటికి పూర్తయ్యే ఈ ప్రాజెక్టులో 2 బీహెచ్ కే ఫ్లాట్ ధర రూ.55 లక్షల నుంచి మొదలవుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వాసవి నందనం సైట్ ను ఓ లుక్కేయండి.

This website uses cookies.