తన ఆదేశాలను సక్రమంగా అమలు చేయని ప్రమోటర్లపై రెరా కొరడా ఝళిపించింది. 13 మంది ప్రమోటర్లకు రూ.1.39 కోట్లు జరిమానా విధించింది. కొనుగోలుదారుల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడమే కాకుండా వాటికి సంబంధించి తన ఆదేశాలు అమలును యూపీ రెరా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇటీవల తన ఆదేశాల అమలు పురోగతిని పరిశీలించింది. ఈ సందర్భంగా 13 మంది ప్రమోటర్లు తన ఆదేశాలను అమలు చేయలేదని గుర్తించింది.
దీంతో వారిపై రెరా చట్టంలోని 38 /63 సెక్షన్ కింద ఆయా ప్రమోటర్లకు ప్రాజెక్టు వ్యయంలో 5 శాతాన్ని జరిమానాగా విధించింది. అంతేకాకుండా 15 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ఆయా ప్రమోటర్లను ఆదేశించింది. జరిమానా మొత్తాన్ని 30 రోజుల్లోగా చెల్లించాలని స్పష్టంచేసింది. కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడేందుకు యూపీ రెరా కఠిన చర్యలు తీసుకుంటోందని, నిబంధనలు ఉల్లంఘించే ప్రమోటర్లకు జరిమానాలు విధిస్తున్నామని యూపీ రెరా చైర్మన్ రాజీవ్ కుమార్ తెలిపారు.
This website uses cookies.