Categories: PROJECT ANALYSIS

ఈస్ట్ హైదరాబాద్లో ఫస్ట్ హైఎండ్ విల్లా ప్రాజెక్ట్

  • ఏవీ వినూత్న హోమ్స్
  • 18.25 ఎక‌రాలు
  • 161 ట్రిప్లే విల్లాలు
  • ప్లాటు సైజులు: 191 – 873 గజాలు
  • బిల్టప్ ఏరియా 2,915 – 7725 చ‌.అ.

వెస్ట్ హైద‌రాబాద్‌తో ఏమాత్రం త‌క్కువ కాకుండా.. అంత‌కుమించిన రెట్టింపు స‌దుపాయాలు.. ఆధునిక‌త ఉట్టిప‌డే అత్యాధునిక ల‌గ్జ‌రీ విల్లాలు.. తూర్పు హైద‌రాబాద్‌లో ఆవిష్కృతం అయ్యాయి. దాదాపు ప‌ద్దెనిమిది ఎక‌రాల్లో రూపుదిద్దుకుంటున్న ఈ ల‌గ్జ‌రీ విల్లా గేటెడ్ క‌మ్యూనిటీని చూస్తే ఎవ‌రికైనా మ‌తిపోవాల్సిందే. ఈస్ట్ హైద‌రాబాద్‌లో.. ఓ లెజెండ్ త‌ర‌హాలో నివ‌సించాల‌ని కోరుకునేవారికీ ప్రాజెక్టు త‌ప్ప‌క న‌ప్పుతుంది. ఎలివేష‌న్ డిజైన్ కూడా ఏవీ హోమ్స్ ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్దింది. ఈ లగ్జరీ కమ్యూనిటీకి ఏవీ వినూత్న హోమ్స్ అని నామకరణం చేశారు.

చూడగానే కళ్లు చెదిరిపోయే, లోపలకు వెళ్లగానే మతి పోగొట్టే విల్లాలను సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే వరంగల్ హైవేలోని పోచారం మున్సిపాలిటీలో రూపుదిద్దుకుంటున్న ఏవీ వినూత్న హోమ్స్ సందర్శించాల్సిందే. సుమారు 18.25 ఎకరాల్లో డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే హెచ్ఎండీఏ, రెరా అనుమతి లభించాయి. ఇందులో మొత్తం 161 ట్రిప్లే విల్లాలు వస్తాయి. ఒక్కో ప్లాటు సైజు 191 నుంచి 873 గజాల్లో ఉంటాయి. బిల్టప్ ఏరియా విషయానికొస్తే. దాదాపు 2,915 నుంచి 7725 చదరపు అడుగుల్లో నిర్మిస్తారు. ఇందులో కేవలం ఈస్ట్, వెస్ట్ ఫేసింగ్ విల్లాలు మాత్రమే ఉన్నాయి. వాస్తు సూత్రాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన ఈ డిజైనర్ గేటెడ్ కమ్యూనిటీలో పచ్చదనానికి పెద్దపీట వేశారు. ఇందులోని క్లబ్ హౌజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాకింగ్ మరియు జాగింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్, ఔట్ డోర్ ఫిట్ నెస్ సెంటర్, హెర్బల్ గార్డెన్స్ వంటివి పొందుపరుస్తారు. బాస్కెట్ బాల్ మరియు బ్యాడ్మింటన్ కోర్టు వంటివి ఏర్పాటు చేస్తారు. పార్టీ లాన్లు, మెడిటేషన్ డెక్, సీటింగ్ డెక్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటివి ఉంటాయి. క్లబ్ హౌజ్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఇందులో స్విమ్మింగ్ పూల్ విత్ డెక్, కిడ్స్ పూల్, బ్యాంకెట్ హాల్, జిమ్, సూపర్ మార్కెట్ వంటివి పొందుపరుస్తారు. ఫుడ్ కోర్టును ఏర్పాటు చేస్తారు.

This website uses cookies.