మీరెప్పుడైనా శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఓఆర్ఆర్ మీదుగా గచ్చిబౌలి వైపు వస్తుంటే.. నార్సింగి వద్ద ఎడమవైపు పంతొమ్మిది అంతస్తుల ఎత్తులో.. టాప్ ఫ్లోరులో పడవ ఆకారం డిజైన్ గల టవర్లు చూశారా? చూడటానికెంతో ఆకర్షణీయంగా కనిపించే ఆ ప్రాజెక్టే.. ఎన్ సీసీ అర్బన్ వన్. ఇదే ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే నిర్మితమైన ప్రప్రథమ ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్. ఈ ప్రాజెక్టు విశిష్ఠతల్ని తెలుసుకుంటే.. ఎంచక్కా మీకు నచ్చిన గృహాన్ని ఇందులో ఎంపిక చేసుకుంటారు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా కోకాపేట్ గురించి డిస్కషన్ జరుగుతోంది. ఇప్పుడిది హాట్ లొకేషన్ గా మారింది. ఇదే కోకాపేట్‌కి కేవలం కిలోన్నర మీటర్ దూరంలోనే ఎన్ సీసీ సంస్థ అర్బన్ వన్ ప్రాజెక్టుని అభివృద్ధి చేస్తోంది. హైదరాబాద్లో ఏ నిర్మాణ సంస్థా ఊహించక ముందే.. ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు పక్కనే అతి పెద్ద ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్పుని ఆరంభించింది. దాదాపు ఇరవై రెండు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అర్బన్ వన్ ని మొదలెట్టింది. నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డు.. కోకాపేట్ ముఖద్వారం చేరువలో ఏర్పాటైన ఈ ప్రాజెక్టులో పలువురు కొనుగోలుదారులు ఆనందంగా జీవనాన్ని గడుపుతున్నారు. హైదరాబాద్లో రణగొణ ధ్వనులకు దూరంగా.. కాలుష్యం లేకుండా.. ప్రశాంతమైన జీవనాన్ని కోరుకునేవారికి.. ఎన్ సీసీ అర్బన్ వన్ మించిన ప్రాజెక్టు లేదనే చెప్పాలి.
17 ఎకరాలు.. 1317 ఫ్లాట్లే
ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏమిటంటే.. 17 ఎకరాల్లో నిర్మించేది కేవలం 12 టవర్లే. ప్లాన్ చేసింది 1317 ఫ్లాట్లే. ఇంతే అధిక స్థలం.. ఇతర ఏ సంస్థకు ఉన్నా.. కచ్చితంగా రెండు వేల ఫ్లాట్లను కట్టేది. కానీ, ఎన్ సీసీ అర్బన్ వన్ ఎప్పుడూ బయ్యర్ల కోణంలోనే ఆలోచిస్తుంది. వారి మనసుకు ఉల్లాసాన్ని కలిగించే రీతిలో ఫ్లాట్ల సంఖ్యను ఉండేలా డిజైన్ చేస్తుంది. పైగా, ప్రస్తుతం కొత్తగా నిర్మితమవుతున్న పలు ప్రాజెక్టుల్ని చూసి.. అర్బన్ వన్‌లో కొన్నవారెంతో సంతోషించాల్సిందే. ఎందుకంటే, ఫ్లాట్ల సంఖ్య ఎక్కువ కాకుండా.. విశాలమైన ఓపెన్ స్పేస్ తో.. ఆకట్టుకునే ల్యాండ్ స్కేపింగ్ తో తమ ప్రాజెక్టు నంబర్ వని అని వీరంతా ముక్తకంఠంతో చెబుతున్నారు.
ప్రీ-ఈఎంఐ హాలీడే..
ఇప్పటికే పూర్తయిన ఆరు బ్లాకుల్లో కొనుగోలుదారులు నివసిస్తున్నారు. ఏడో బ్లాకు నిర్మాణం చివరి దశలో ఉంది. మిగతా బ్లాకుల్లో సంస్థ ఫ్లాట్ల బుకింగ్ ఆరంభించింది. తొమ్మిదో బ్లాకులో ప్రత్యేకంగా నాలుగు పడక గదుల ఫ్లాట్లకు శ్రీకారం చుట్టింది. ఒక్కో ఫ్లాటును 3390 చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. ఇది స్ట్రాటజిక్ లొకేషన్లో ఉండటమే ప్రధాన కారణం. పైగా ప్రీ-ఈఎంఐ హాలీడే పథకాన్ని వర్తింపజేస్తోంది. అంటే, ఇప్పుడు పది శాతం చెల్లించి ఫ్లాటును బుక్ చేస్తే సరిపోతుంది. 80 శాతం సంస్థే ఈఎంఐ చెల్లిస్తుంది. మిగతా పది శాతం సొమ్మును ఫ్లాట్ హ్యండోవర్ సమయంలో కడితే చాలు.