శ్రావణి బెంగళూరులో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న తన ఆఫీసుకు వెళ్లడానికి గంటా గంటన్నర సమయం పడుతుంది. అదే వర్షం కురిస్తే ఎప్పటికి వెళుతుందో చెప్పలేని పరిస్థితి. ఇంట్లో చిన్నపాపను సాయంత్రం వరకు ఉండే పనిమనిషి చూసుకుంటుంది. దీంతో ఆఫీసు నుంచి రావడం లేట్ అయితే పాపను చూసుకోవడానికి ఎవరూ ఉండరు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె పని చేస్తున్న కంపెనీ ఆమె ఇంటికి దగ్గర్లో కో వర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేసింది. దీంతో శ్రావణి బాధలు తీరాయి. ఓ దశలో ఉద్యోగం మానేయాలి అనుకుంటున్న తరుణంలో తన ఇంటికి సమీపంలోనే కో వర్కింగ్ స్పేస్ రావడంతో తన సమస్య తీరిందని, ఇప్పుడు ఏదైనా అర్జెంట్ పని ఉంటే ఇంటికి వెళ్లి రావొచ్చని ఆమె చెప్పారు.
భారత్ లో ట్రాఫిక్, ఇతరత్రా అంశాల నేపథ్యంలో ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ విధానం భలేగా సూట్ అయింది. ఇది అటు ఉద్యోగులు, ఇటు యాజమాన్యం ఇద్దరికీ అనువుగా ఉంది. ఉద్యోగులకు అనువుగా, సౌకర్యవంతంగా ఉండగా.. యాజమాన్యాలకు వ్యయం నియంత్రణలో ఉపకరిస్తోంది. దీంతో వీటికి డిమాండ్ బాగా పెరుగుతోంది. ముఖ్యంగా వర్క్ ఫ్రం హోమ్ విధానం నుంచి అందరూ ఆఫీసులకు రావాలనే నిర్ణయాన్ని చాలా కంపెనీలు తీసుకోవడంతో ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ లకు డిమాండ్ ఎక్కువైంది. పెద్ద పెద్ద కంపెనీలతోపాటు చాలా సంస్థలు వీటి వైపు మొగ్గు చూపిస్తున్నాయి. వర్క్ ఫ్రం హోమ్ విధానం క్రమంగా తగ్గడంతో ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ కు వేగంగా డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా టైర్-2 నగరాల్లో శాటిలైట్ ఆఫీసులు, బ్యాక్ ఎండ్ ఆఫీసులు పెరుగుతున్నాయి.
కంపెనీలు కూడా వ్యయ తగ్గింపుపై దృష్టి పెట్టడంతోపాటు తన సిబ్బందికి అనుకూల వాతావరణం ఏర్పాటు చేయడానికి, సౌకర్యవంతమైన పని వాతావరణం కల్పించడానికి ఫ్లెక్సిబుల్ స్పేస్ ను ఎంచుకుంటున్నాయి. వీటిని సెటప్ చేయడం లేదా తొలగించడం కూడా చాలా సులభం కావడంతో వీటివైపే ఎక్కువమంది మొగ్గు చూపిస్తున్నారు. 2024 మొదటి త్రైమాసికంలో అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే ఫ్లెక్సిబుల్ స్పేస్ డిమాండ్ 15 శాతం మేర పెరిగింది
This website uses cookies.