కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 2 పక్కనే డెవలప్ అవుతోంది. అంటే ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ ఈ ప్రాజెక్టుకు సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. తెల్లాపూర్ ఎంఎంటీఎస్ చేరువలోనే ఉండటం కలిసొచ్చే అవకాశం. ఎందుకంటే, రైళ్ల ద్వారా కూడా అన్వితా హై నైన్‌కు కనెక్టివిటీ ఉంది.
అన్వితా హై నైన్ ప్రాజెక్టును పదిహేను ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు. ఇందులో 30 అంతస్తులవి తొమ్మిది టవర్లను నిర్మిస్తున్నారు. టూ, త్రీ బెడ్‌రూం ఫ్లాట్లతో పాటు స్కై విల్లాల్ని డెవలప్ చేస్తున్నారు. హెచ్ఎండీఏ, టీఎస్ రెరా అనుమతి లభించడంతో ఇందులో ఫ్లాట్లు కొనాలని భావించేవారికి హోమ్ లోన్స్ కూడా లభిస్తాయి. పైగా, ఈ ప్రాజెక్టుతో వివిధ బ్యాంకులు కూడా టై అప్ అవ్వడం విశేషం.
అన్వితా హై నైన్‌లో ఎనభై శాతం ఓపెన్ స్పేస్ ఉండటం విశేషం. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌తో కూడుకున్న రెండు ఎనిమిటీస్ బ్లాకుల్ని ఇందులో ఏర్పాటు చేస్తున్నారు. రెండు స్విమ్మింగ్ పూళ్లను డెవలప్ చేస్తున్నారు. సన్ డెక్స్, పార్టీ లాన్స్, యోగా డెక్ వంటి ఆధునిక సదుపాయల్ని పొందుపరుస్తున్నారు.
ఈ ప్రాజెక్టు పోడియంలో ఎక్కడా వాహనాలు కనిపించవు. నివాసితులకు పూర్తి స్థాయి సెక్యూరిటీతో పాటు ఇరవై నాలుగు గంటలు పని చేసే సీసీటీవీల పర్యవేక్షణ ఉంటుంది. హోమ్ ఆటోమేషన్‌కు పెద్దపీట వేశారు. హండ్రెడ్ పర్సంట్ పవర్ బ్యాకప్‌తో పాటు ప్రాజెక్టు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు. సెంట్రలైజ్డ్ పైపుల ద్వారా గ్యాస్ సరఫరా ఉంటుంది. పెట్ పార్కుకు స్థానం కల్పించారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి ఈ ప్రాజెక్టు ఎప్పటికైనా బెస్ట్ అని చెప్పొచ్చు. చిన్నారుల నుంచి వృద్దులవరకూ కావాల్సిన సమస్త ఆధునిక సదుపాయాలకు అన్వితా హైనైన్‌లో పెద్దపీట వేశారు. సైక్లింగ్, జాగింగ్ ట్రాక్, స్కేటింగ్ రింక్, ఔట్‌డోర్ జిమ్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్ వంటివి డెవలప్ చేస్తారు. ఒక ఎకరంలో సెంట్రల్ కోర్ట్ యార్డ్ ఇందులోని నివాసితుల్ని అమితంగా ఆకట్టుకుంటుంది.
This website uses cookies.