Categories: LATEST UPDATES

హుస్సేన్ సాగర్ లో  ఫ్లోటింగ్ మ్యూజికల్ ఫౌంటెన్

రూ.17.2 కోట్లతో ఏర్పాటుచేసిన హెచ్ఎండిఏ

జంటనగరాలను కలిపే చారిత్రాత్మక హుస్సేన్ సాగర్ బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ (బిపిపి) పరిసరాలను అత్యంత ఆకర్షణీయంగా, పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది.  హుస్సేన్ సాగర్ లుంబిని పార్క్ సమీపంలో రూ.17.2 కోట్ల వ్యయంతో హెచ్ఎండిఏ రూపొందించిన ఫ్లోటింగ్ మ్యూజికల్ ఫౌంటెన్ ను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయరెడ్డి, ఎంఏయుడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ,  హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాదు నగరానికి అపూర్వ ఆదరణ ఉందని, ట్యాంక్ బండ్ పరిసరాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మంత్రి కేటీ రామారావు ఆలోచనల కనుగుణంగా హెచ్ఎండిఏ అధికారులు ఫ్లోటింగ్ మ్యూజికల్ ఫౌంటెన్ అద్భుతంగా తీర్చిదిద్దారని మంత్రి అభినందించారు.

ఇప్పటివరకు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పురపాలక శాఖ మంత్రి  కెటి రామారావు ఆదేశాలతో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మెట్రోపాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్ పర్యవేక్షణలో అతి తక్కువ సమయంలో హుస్సేన్ సాగర్ లో అతిపెద్ద ఫ్లోటింగ్ మ్యూజికల్ ఫౌంటెన్ రూ.17.2 కోట్లతో హెచ్ఎండిఏ ఏర్పాటు చేసింది.

హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనగరాలను కలిపే చారిత్రాత్మక హుస్సేన్ సాగర్ బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ (బిపిపి) పరిసరాలను అత్యంత ఆకర్షణీయంగా, పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దేందుకు  ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇప్పటికే ట్యాంక్ బండ్ సుందరీకరణ (బ్యూటిఫికేషన్) పనులను హెచ్ఎండిఏ విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే. పీవీ మార్గ్ (నెక్లెస్ రోడ్) వెంట మరికొన్ని ఆకర్షణీయమైన అంశాలను చేకూర్చేందుకు హెచ్ఎండిఏ సన్నాహాలు చేస్తున్నది.

• ఎన్టీఆర్ మార్గ్‌కు సమీపంలోని హుస్సేన్ సాగర్ సరస్సులో ఫ్లోటింగ్ టైప్ మ్యూజికల్ ఫౌంటెన్‌ను 180 మీ పొడవు, 10మీ వెడల్పు మరియు 90మీ ఎత్తుతో రూ.17.02 కోట్లతో హెచ్ఎండిఏ చేపట్టింది.
• మ్యూజికల్ ఫౌంటెన్ 180 మీటర్ల పొడవు కలిగిన ఐకానిక్ ఫీచర్‌తో భారతదేశంలోనే అతిపెద్ద తేలియాడే ఫౌంటెన్.
• ఫౌంటెన్‌లో 3సెట్ల లేజర్ ఉంది, ఇది వివిధ థీమ్‌లను చూపుతుంది.
• ఫౌంటెన్‌లో పొగమంచు ఫెయిరీ ఫాగ్ కూడా ఉంది, ఇది సంగీతంతో పాటు క్లౌడ్ ఎఫెక్ట్‌ను సృష్టిస్తుంది.
• ఫౌంటెన్ యొక్క అన్ని నాజిల్‌లు మరియు జెట్‌లు DMX కంట్రోలర్ ద్వారా ప్రోగ్రామ్ చేయబడతాయి మరియు సంగీతంతో సమకాలీకరించబడతాయి.
ఈ డైనమిక్ ఫౌంటెన్‌ను రూపొందించడానికి SS304 తయారు చేసిన 800 జెట్ నాజిల్‌లు మరియు IP68 రేటింగ్‌తో కూడిన 880 అండర్‌వాటర్ LED లైట్‌లు ఇన్‌స్టాల్ చేయబడ్డాయి.
• ఛేజింగ్ నాజిల్‌ల స్ప్రే ఎత్తు 12 మీ నుండి 45 మీ వరకు ఉంటుంది, అయితే సెంట్రల్ జెట్ 90 మీ స్ప్రే ఎత్తుతో ఎత్తైన జెట్.
• మ్యూజికల్ ఫౌంటైన్ వారం రోజులలో ప్రతిరోజూ రాత్రి 7 నుండి రాత్రి 10 గంటల వరకు మరియు వారాంతంలో (శనివారం & ఆదివారం) మరియు పబ్లిక్ హాలిడేలలో 4 షోలలో ప్రతి రోజు 20 నిమిషాల 3 షోలలో నిర్వహించబడుతుంది.

This website uses cookies.