రేమండ్ గ్రూప్ తన ఎఫ్ఎంసీజీ వ్యాపారాన్ని విక్రయించిన తర్వాత రియల్ రంగం ద్వారా రూ.25వేల కోట్ల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గౌతమ్ హరి సింఘానియా నేతృత్వంలోని రేమండ్ సంస్థ.. థానేలోని ల్యాండ్ బ్యాంక్ అభివృద్ధి ద్వారా ఈ మొత్తం సంపాదించాలని ప్రణాళికలు రచిస్తోంది. రేమండ్ గ్రూప్ కు థానేలో దాదాపు వంద ఎకరాల భూమి ఉంది. అందులో రెరా ఆమోదించిన 11.8 మిలియన్ చదరపు అడుగుల కార్పెట్ ఏరియా ఉంది.
ప్రస్తుతం 40 ఎకరాల్లో డెవలప్ మెంట్ పనులు జరుగుతున్నాయి. రూ.9వేల కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి. మరో రూ.16వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు కూడా అక్కడ చేపట్టే అవకాశం ఉంది. తద్వారా మొత్తం రూ.25వేల కోట్లు ఆదాయం పొందాలని రేమండ్ భావిస్తోంది. రేమండ్ గ్రూప్ లైఫ్ స్టైల్, రియల్ ఎస్టేట్, ఇంజనీరింగ్ అనే మూడు ప్రధాన విభాగాల్లో కొనసాగుతుందని సింఘానియా తెలిపారు
This website uses cookies.