Categories: LATEST UPDATES

వెల్లువలా పీఈ పెట్టుబడులు

భారత్ లోకి ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. ఎన్నికలు జరిగిన మే నెలలో 145 ఒప్పందాలతో 6.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. రియల్ ఎస్టేట్ తోపాటు ఈ కామర్స్, హెల్త్ కేర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ లోకి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి. మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ లో 38 ఒప్పందాలతో 1.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా, ఫ్లిప్ కార్ట్ లో గూగుల్ పెట్టుబడి పెట్టిన 350 మిలియన్ డాలర్లే పెద్ద ఒప్పందం. 99 ఒప్పందాల ద్వారా 4 బిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులు వచ్చాయి. జనవరి తర్వాత వచ్చిన అత్యధిక పీఈ పెట్టుబడులు ఇవే కావడం విశేషం.

ఒక్కోటీ 100 మిలియన్ డాలర్ల కంటే పైబడిన పెట్టుబడులు కలిగిన తొమ్మిది ఒప్పందాలు కూడా ఉన్నాయి. ఇక 5 ఐపీఓల ద్వారా 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా, మూడు డీల్స్ లో క్యూఐపీల ద్వారా 0.5 బిలియన్ డాలర్లు వచ్చాయి.

This website uses cookies.