హైదరాబాద్ లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరగబోయే తొమ్మిదో ఫార్ములా-ఈ రేసు కోసం నెక్లెస్ రోడ్డు సిద్ధమవుతోంది. హుస్సేన్ సాగర్ చుట్టూ ప్రతిపాదిత ట్రాక్ కు సంబంధించిన పనులను హెచ్ఎండీఏ మొదలుపెట్టింది. సాగర్ చుట్టూ ఉన్న రోడ్డును బ్లాక్ టాపింగ్ తో రేసింగ్ కు అనువుగా మార్చనుంది. నెల రోజుల్లోగా ఈ పనులు పూర్తి చేయనుంది. అనంతరం ఈ రోడ్డు రేసింగ్ కు అనువుగా ఉందో లేదో రోడ్డు భద్రతా ప్రమాణాల పరీక్ష నిర్వహిస్తుంది. ఫార్ములా-ఈ ట్రాక్ పొడవు 2.80 కిలోమీటర్లు. మొత్తం 17 మలుపులు ఉంటాయి. ఈ రేసును చూడటానికి వీక్షకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. రేస్ సర్క్యూట్ ఎన్టీఆర్ గార్డెన్ ఎదురుగా మొదలై.. ఎన్టీఆర్ మార్గ్, ప్రసాద్ ఐమ్యాక్స్ రోడ్డు ద్వారా ప్రయాణించి అక్కడ లూప్ తీసుకుని తిరిగి ఎన్టీఆర్ గార్డెన్ వద్దకు చేరుకుంటుంది.
This website uses cookies.