కొనుగోలుదారులను రూ.3.5 కోట్ల మేర మోసం చేసిన ముగ్గురు వ్యక్తులపై మహారాష్ట్రలోని నాగ్ పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఇద్దరు ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందినవారు మరొకరు బ్యాంకు ఉద్యోగి. ఫర్నిచర్ వ్యాపారం చేస్తున్న 47 ఏళ్ల వ్యక్తి నాగ్ పూర్ లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్న సంస్థతో ఓ షాపు కొనుగోలు కోసం 2016లో రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం రూ.5 లక్షల చెక్ ఇచ్చి.. మిగిలిన రూ.15 లక్షలు ఓ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు. మరోవైపు సదరు రియల్ ఎస్టేట్ సంస్థ ఓ సహకార బ్యాంకు నుంచి రూ.5 కోట్ల రుణం తీసుకుంది. ఈ క్రమంలో సహకార బ్యాంకు పేరుతో 47 ఏళ్ల వ్యక్తి ఓ డీడీని బిల్డర్ కు ఇవ్వగా.. అది ఆ సంస్థ డైరెక్టర్లలో ఒకరి వ్యక్తిగత ఖాతాలో జమ చేశారు.
ఇదే విధంగా మొత్తం 14 మంది ఇచ్చిన రూ.3.44 కోట్ల విలువైన చెక్కులను అదే ఖాతాలో జమ చేశారు. ఈ నేపథ్యంలో లోన్ వాయిదాలను చెల్లించినప్పటికీ, బ్యాంకు నుంచి నోటీసులు రావడంతో బిల్డర్ తమను మోసం చేశారని గ్రహించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
This website uses cookies.