భారతదేశపు మూడు సిమెంట్ తయారీదారులలో ఒకరైన శ్రీ సిమెంట్స్ ( Shree Cement ) భారతదేశ గెలుపు సంబరాల్ని జరుపుతున్నది. ఈ క్రమంలో టోక్యో ఒలంపిక్స్ విజేతలకు వారి కలల గృహాలను నిర్మించడంలో సహాయపడటానికి ఉచిత సిమెంటును అందిస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ నిర్ణయంతో శ్రీ సిమెంట్స్.. మన దేశానికి గర్వకారణంగా నిలిచిన వారిని గౌరవించడం ద్వారా క్రీడల పట్ల తమ నిబద్ధతను చాటిచెప్పింది. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సిమెంట్ ఉత్పత్తిదారులలో శ్రీ సిమెంట్స్ ఒకటి. ప్రస్తుతం సంవత్సరానికి 44.4 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తోంది.
శ్రీ జంగ్ రోధక్ సిమెంట్, బంగూర్ సిమెంట్, రూఫాన్ మరియు రాక్‌స్ట్రాంగ్ సిమెంట్ వంటి విభిన్న ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను కంపెనీ ఆవిష్కరించింది. “భారతదేశ అథ్లెట్లు అత్యున్నత స్థాయి క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అది మనకెంతో గర్వకారణంగా నిలిచింది. ఒక భారతీయుడిగా మరియు ఒక క్రీడా ఔత్సాహికుడిగా, వారు చేస్తున్న ప్రతిదానికీ కొంతైనా తిరిగి ఇవ్వడం ముఖ్యం అని నేను భావిస్తున్నా”నని శ్రీ సిమెంట్స్ లిమిటెడ్ ఎండీ హెచ్ఎం బంగూర్ తెలిపారు.
This website uses cookies.