Categories: NEW PRODUCTS

పీఈబీ నిర్మాణం ప్రత్యేకతలివే!

సంప్ర‌దాయ విధానంలో ఇల్లు ఎలా క‌డ‌తాం? పునాదులు త‌వ్వి.. కాంక్రీటు పోసి.. పిల్ల‌ర్లు క‌ట్టి.. శ్లాబు వేసి.. గోడ‌ల్ని క‌ట్టి ప్లాస్ట‌రింగ్ చేస్తాం. కానీ, ఇందుకు భిన్నంగా.. సరికొత్త పరిజ్ఞానం అందుబాటులోకి వ‌చ్చేసింది. అదే ప్రీ ఇంజినీర్డ్ బిల్డింగ్‌. పీఈబీ. ఉక్కు సాయంతో క‌ట్టే నిర్మాణాల‌న్న‌మాట‌. స్థలం కొలతల్ని తీసుకుని.. నిర్మాణ ప్రక్రియను ఒక ఫ్యాక్టరీలో తయారు చేసి.. స్థలం వద్దకు తీసుకొచ్చి బిగించే ప్రక్రియకు మన వద్ద ఆదరణ పెరుగుతోంది. మరి, పీఈబీని ఎంత విస్తీర్ణంలో కడతారు? దీనిక‌య్యే ఖ‌ర్చెంత‌?

ఆర్సీసీ నిర్మాణ విధానానికి ప్ర‌త్యామ్నాయాలు పెరుగుతున్నాయి. సిమెంటు కాంక్రీటు బదులు ప్రీ ఇంజినీర్డ్ భవనాల్ని కట్టే పోకడకు ఇటీవల కాలంలో ఆదరణ అధికమైంది. ఇప్ప‌టిదాకా గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో వీటి వైపు మొగ్గు చూపేవారు. ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ పోక‌డ‌కు ఆద‌ర‌ణ పెరుగుతోంది. ఒక ఫ్యాక్ట‌రీలో ఇంటి స్ట్ర‌క్చ‌ర్‌ను త‌యారు చేసి.. ప్లాటు వ‌ద్ద‌కు తీసుకొచ్చి నిర్మాణం పూర్తి చేస్తారు. ఇలా ఆరు వంద‌ల చ‌ద‌ర‌పు అడుగుల నుంచి నాలుగు అంత‌స్తుల భ‌వ‌నాల వ‌ర‌కూ పీఈబీ సాయంతో నిర్మించ‌వ‌చ్చు. ఆఫీసులు, ఫామ్ హౌజ్లు, సైట్ ఆఫీసులు, తాత్కాలిక నిర్మాణాలు, బహుళ అంతస్తుల అపార్టుమెంట్లను పీఈబీ విధానంలో కట్టవచ్చు.

ఈ విధానంలో కట్టడం వల్ల పలు రకాల ప్రయోజనాలున్నాయి. భవిష్యత్తులో పగుళ్లకు ఆస్కారం ఉండదు. లీకేజీ వంటి సమస్యలు ఎదురు కావు. ఒకట్రెండు నెలల్లో నిర్మాణం పూర్తి చేయవచ్చు. ఒక దగ్గర కట్టిన కట్టడాన్ని జాగ్రత్తగా తొలగించి వేరే స్థలానికీ తీసుకెళ్లవచ్చు. అంటే, ఒక చోట కట్టిన ఇంటిని.. త‌క్కువ న‌ష్టంతో వేరే కొత్త చోటికి తీసుకెళ్లి మ‌ళ్లీ నిర్మించుకోవ‌చ్చు. శానిటరీ వేర్, ఫ్లోరింగ్ టైల్స్, ఎలక్ట్రిక్, కిచెన్ వంటివన్నీతో కలిపి చదరపు అడుక్కీ రూ.3,500 దాకా ఖర్చు వస్తుంది.

ఇలా ఆర్డ‌ర్ చేయాలి

పీఈబీలో ఇల్లు క‌ట్టాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన త‌ర్వాత నిర్మాణానికి సంబంధించి ఎల‌క్ట్రిక‌ల్‌, ప్లంబింగ్ డిజైన్ల‌ను సంస్థ‌కు పంపించాల్సి ఉంటుంది. ఆత‌ర్వాత దానికెంత ఖ‌ర్చు అవుతుంద‌నే విష‌యాన్ని పీఈబీ సంస్థ తెలియ‌జేస్తుంది. ఒప్పందం కుదుర్చుకుంటే ప‌ని ఆరంభ‌మ‌వుతుంది. స్ట్ర‌క్చ‌ర్ ను బ‌ట్టి ఒక‌ట్రెండు నెల‌ల్లో ప‌ని పూర్త‌వుతుంది.

మేడ్చ‌ల్‌లో సొంత ఫ్యాక్ట‌రీ..

మేము 2014 నుండి ప్రీఫాబ్ వ్యాపారంలో వ్యాపారంలో ఉన్నాం, లోనావాలా సమీపంలో పుణే ముంబై హైవేలో మొదటి పెద్ద ప్రాజెక్టును ఆరంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 500 కంటే ఎక్కువ ప్రిఫాబ్ గృహాలను నిర్మించాం. ద‌క్షిణాది రాష్ట్రాల్లో సేవ‌ల్ని అందించేందుకు మేడ్చల్ సమీపంలో ప్రీఫాబ్ హోమ్స్ కోసం త్వరలో ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తున్నాం. స్లైడింగ్ గేట్ మోటర్లు, స్వింగ్ గేట్ మోటర్లు, కర్టెయిన్ మోటర్లు, హోమ్ ఆటోమేషన్ వంటివి చేస్తాం.- అజ‌య్ కుమార్‌, ఎండీ, విజ‌న్ ఎంట‌ర్‌ప్రైజెస్‌

This website uses cookies.