స్థానికంగా ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం స్పందించింది. ఇసుక తవ్వకాల నియమావళి 2015ను అమలు చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్‌లను ఇటీవల ఆదేశించింది. స్థానికులకు ఇసుకను అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం కలెక్టర్‌లకు సూచించింది. అందులో భాగంగా సొంతంగా ఇళ్ల నిర్మాణం చేసుకునే బలహీన వర్గాల వారికి ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని ప్రభుత్వం సూచించింది.
అయితే ఈ ఉత్తర్వులను ఉల్లఘించే వారిపై చర్యల్ని తీసుకోవాలని ప్రభుత్వం కలెక్టర్‌లను ఆదేశించింది. దీంతో పాటు ఉచిత ఇసుకను పక్కదారి పట్టిస్తే.. చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీనికి సంబంధించిన మెమో 9060/ఎం.1(1)/2014, తేదీ 23.03.2024ను అన్ని జిల్లాల కలెక్టర్‌లకు మైనింగ్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ బెన్హర్ మహేశ్‌దత్ ఎక్కా జారీ చేశారు.
This website uses cookies.