Categories: LATEST UPDATES

మిద్దె సాగుపై ఉచిత శిక్షణ

మిద్దె సాగు ఎలా చేయాలనే అంశంపై ఈనెల 14 (రెండో శనివారం), 22 (ఆదివారం) శిక్షణ ఇవ్వనున్నట్టు హైదరాబాద్ లోని ఉద్యాన శిక్షణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంటి ఆవాసాలు, బాల్కనీల్లో కూరగాయల పెంపకంపై ఆసక్తి ఉన్న వారికి అర్బన్ ఫామింగ్ పథకం ద్వారా ఈ శిక్షణ ఇవ్వనున్నట్టు ఉద్యానశాఖ, పట్టు పరిశ్రమ సంచాలకులు వెల్లడించారు.

మిద్దె తోటల సాగు, ప్రాథమిక అంశాలు, స్థల ఎంపిక, మొక్కలు ఎంపిక, మట్టి మిశ్రమ తయారీ విధానం, విత్తనాల ఎంపిక, సేంద్రియ ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, సేంద్రియ పద్ధతిలో చీడపీడల నివారణ గురించి నిపుణులు విపులంగా వివరిస్తారని తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఉద్యాన శిక్షణ సంస్థలో జరిగే ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు రూ.100 చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9705 384 384 నంబర్ కు కాల్ చేయాలని పేర్కొన్నారు.

This website uses cookies.