Categories: PROJECT ANALYSIS

విల్లాల్లో రారాజు.. హాల్ మార్క్ ఇంపీరియా

విలాసవంతమైన జీవితానికి విల్లాలే కేరాఫ్ చిరునామా. చుట్టూ పచ్చదనంతో, సకల సౌకర్యాలతో లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలనుకునేవారు విల్లాల వైపే మొగ్గు చూపుతారు. ఎక్స్ క్లూజివ్ గా ఉండే విల్లాల కమ్యూనిటీలో భాగం కావడానికి చాలామంది తహతహలాడుతుంటారు. మరి అలాంటి విల్లాలకే రారాజు వంటి కమ్యూనిటీ ఉంటే.. అందులో జీవితం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా? సరిగ్గా అలాంటి కమ్యూనిటీయే హాల్ మార్క్ ఇంపీరియా. గోపన్ పల్లి ఉస్మాన్ నగర్ లో అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటోంది. మొత్తం 20 ఎకరాల సువిశాల స్థలంలో చుట్టూ పచ్చదనంతో 130 విల్లాలు అందుబాటులోకి రానున్నాయి.

ఎంట్రన్స్ గేట్ నుంచి క్లబ్ హౌస్ వరకు అన్నీ ఎంతో శ్రద్ధతో ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ గేట్, మెయిన్ ఎంట్రన్స్ రోడ్, క్లబ్ హౌస్ డ్రాపింగ్ ఏరియా, పెడస్ట్రియన్ పాత్ వే, ఓపెన్ స్పేస్ ఎంట్రన్స్ డెక్, జాగింగ్ ట్రాక్, సీటింగ్ ఏరియా, లాన్, విజిటర్స్ పార్కింగ్, ఓపెన్ స్పేస్ ఎంట్రన్స్ డెక్, పార్టీ లాన్, గ్రిడ్ ప్లాంటేషన్, పిల్లల ఆటస్థలం, స్టేజ్, ఏంఫిథియేటర్, టెన్నిస్ కోర్టు, హాఫ్ బాస్కెట్ బాల్ కోర్టు, పూల్ డెక్, లాప్ పూల్, కిడ్స్ పూల్, ఫిట్ నెస్ స్టేషన్ వంటి ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో వ‌చ్చేవి కేవలం ఈస్ట్, వెస్ట్ ఫేసింగ్ విల్లాలే.

ఈస్ట్ ఫేసింగ్ విల్లాను 427.75 చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ 2030 చదరపు అడుగులు కాగా, ఫస్ట్ ఫ్లోర్ 1985 చదరపు అడుగులు, సెకండ్ ఫ్లోర్ 1240 చదరపు అడుగుల్లో మొత్తం 5255 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాలో తీర్చిదిద్దుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో రెండు కార్లకు సరిపడా పార్కింగ్ స్పేస్ తోపాటు లివింగ్ ఏరియా, డ్రాయింగ్ ఏరియా, కిచెన్, డైనింగ్, బెడ్ రూం, మెయిడ్ రూం, లిఫ్ట్ ఉంటాయి. ఇక ఫస్ట్ ఫ్లోర్ లో మాస్టర్ బెడ్ రూంతోపాటు మరో రెండు బెడ్ రూంలు, ఫ్యామిలీ లాంజ్, కవర్డ్ సిటవుట్, పూజగది ఏర్పాటు చేస్తున్నారు. సెకండ్ ఫ్లోర్ లో ఒక బెడ్ రూంతోపాటు లాబీ, హోంథియేటర్ రూం, లాండ్రీ గదితోపాటు ఓపెన్ టెర్రస్ ఉంటుంది.

వెస్ట్ ఫేసింగ్ విల్లా విషయానికి వస్తే.. 427.75 చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ 2030 చదరపు అడుగులు కాగా, ఫస్ట్ ఫ్లోర్ 1985 చదరపు అడుగులు, సెకండ్ ఫ్లోర్ 1360 చదరపు అడుగుల్లో మొత్తం 5375 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాలో నిర్మిస్తున్నారు. అధునాతన డిజైన్లు, అదిరిపోయే ల్యాండ్ స్కేపింగ్ తో అత్యద్భుతంగా రూపొందుతున్న ఇంపీరియా కమ్యూనిటీలో స్ట్రీట్ లైట్ల డిజైన్ లోనూ ప్రత్యేకత కనబరిచారు. మాస్టర్ ప్లాన్ ను కూడా చాలా అందంగా తీర్చిదిద్దారు. ఎక్కడికక్కడ పచ్చదనం, ఆకట్టుకునే శిల్పాకృతులతో ప్రతి అంశంలోనూ ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. మెయిన్ ఎంట్రన్స్ రోడ్డు 60 అడుగుల్లో ఉండగా.. మిగిలిన రోడ్లను 40 అడుగుల్లో నిర్మిస్తున్నారు. క్లబ్ హౌస్ సైతం ప్రత్యేకంగా ఉండేలా డిజైన్ చేశారు. పార్టీ లాన్, ఫౌంటెయిన్.. ఇలా అన్నీ అందంగానే కాకుండా సౌకర్యవంతంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇతర విల్లాలేవీ దీనికి సాటిరావు అనే రీతిలో ఈ కమ్యూనిటీ రూపుదిద్దుకుంటోంది. విల్లాల నవ ప్రపంచంలో ఆహ్లాదకర, ఆనందమయ, విలాసవంతమైన జీవితం గడపాలనుకునేవారికి హాల్ మార్క్ ఇంపీరియా బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే కారు తీయండి.. ఇంపీరియాను సందర్శించి ఓ విల్లా బుక్ చేసుకోండి.

This website uses cookies.