Categories: LEGAL

సాలార్ పురియా సత్వా బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్

  • హీరా గోల్డ్ కుంభకోణంతో లింకు
    నేపథ్యంలో రూ.50 కోట్లు ఫ్రీజ్ చేసిన ఈడీ

హీరా గోల్డ్ కుంభకోణంతో లింకులున్నాయనే కారణంతో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సాలార్ పురియా సత్వాకి చెందిన రూ.50 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫ్రీజ్ చేసింది. హీరా గ్రూప్ తో సాలార్ పురియా చేసిన లావాదేవీలు షెల్ కంపెనీలకు వెళ్లినట్టుగా ఈడీ గుర్తించి, ఈ మేరకు చర్యలు తీసుకుంది. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద నౌహెరా షేక్ కు చెందిన హీరా గ్రూప్ పై ఈనెల 7న ఈడీ సోదాలు జరిపింది.

ఈ సందర్భంగా 316 బ్యాంకు ఖాతాల్లో డబ్బును ఫ్రీజ్ చేసింది. అంతే కాకుండా రూ.29 లక్షల నగదు, వివిద దేశాలకు చెందిన కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకుంది. రూ.41 కోట్లు బెంగళూరుకు చెందిన నీలాంచల్ టెక్నోక్రాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు బదిలీ అయినట్టు ఈడీ గుర్తించింది. ఈ కంపెనీ సాలార్ పురియా సత్వా గ్రూప్ కి చెందింది కావడంతో ఈడీ అప్రమత్తమై ఈ కంపెనీ బ్యాంకు ఖాతాను స్తంభింపజేసింది. అలాగే సాలార్ పురియా ప్రమోటర్లు, డైరెక్టర్ల ఆదేశాల మేరకు కోల్ కతా, షిల్లాంగ్ లో రిజిస్టర్ అయిన పలు షెల్ కంపెనీలకు డబ్బు బదిలీ చేసినట్టు దర్యాప్తులో తేలింది.

This website uses cookies.