Categories: TOP STORIES

అమితాబ్ నుంచి కృతి సనన్ వరకు.. భూముల వైపై మొగ్గు

భూమి.. ఎప్పటికీ అదిరిపోయే అసెట్. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు భూమి కొనుగోలుకు మొగ్గు చూపించనివారే ఉండరు. డబ్బులు ఉండాలే గానీ.. భూమిపై పెట్టుబడులకు ఎనలేని ఆసక్తి కనబరుస్తారు. ఈ విషయంలో బాలీవుడ్ నటుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమ ఇన్వెస్ట్ మెంట్ పోర్ట్ ఫోలియోను వైవిద్యపరచడానికి, దీర్ఘకాలికంగా సంపదను సృష్టించడానికి రియల్ రంగానే వారు ఎంచుకుంటారు. దశాబ్దాలుగా భారతదేశంలోని రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇచ్చే ప్రాంతంగా బాలీవుడ్ ప్రసిద్ధి పొందింది.

ఈ ఏడాది కూడా పలువురు సెలబ్రిటీలు చేసిన భూముల కొనుగోళ్లు వార్తల్లో నిలిచాయి. అమితాబ్ నుంచి కృతి సనన్, సుహానా ఖాన్ వరకు చాలామంది భూములు కొన్నారు. నటి కృతి సనన్ జులైలో ముంబైకి సమీపంలోని అలీబాగ్‌లో 2,000 చదరపు అడుగుల ప్లాట్‌ను కొనుగోలు చేశారు. ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా ద్వారా సోల్ డి అలీబాగ్ ప్రాజెక్టులోని భూమిని ఆమె కొన్నారు. అంతకుముందు బిగ్ బి అమితాబ్ బచ్చన్ అలీబాగ్‌లోని అదే ప్రాజెక్టులో రూ.10 కోట్లకు 10,000 చదరపు అడుగుల ప్లాట్‌ను కొనుగోలు చేశారు. దీనికి ముందు ఆయన అయోధ్యలోని అదే బిల్డర్ నుంచి 7-స్టార్ మిక్స్డ్ యూజ్ ఎన్‌క్లేవ్ అయిన సరయు ప్రాజెక్టులో ప్లాట్ కొన్నారు.

దాదాపు 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించాలని భావిస్తున్న ఆ ప్లాట్ విలువ ₹14.5 కోట్లు అని రియల్ ఎస్టేట్ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సెలబ్రిటీ క్లయింట్‌ల సుదీర్ఘ జాబితాలో యువ తరం నటులు కూడా ఉన్నారు. ది ఆర్చీస్‌తో భారతదేశంలో తెరపైకి వచ్చిన షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అలీబాగ్‌లోని థాల్ గ్రామంలో రూ.9.5 కోట్లు వెచ్చించి వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. సుహానా తండ్రి షారుఖ్ ఖాన్ కు కూడా థాల్‌లో సముద్రానికి ఎదురుగా ఓ ప్రాపర్టీ ఉంది. గతేడాది సుహానా అలీబాగ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో 1.5 ఎకరాల విస్తీర్ణంలో మూడు నిర్మాణాలతో కూడిన వ్యవసాయ భూమిలో రూ.12.91 కోట్ల పెట్టుబడి పెట్టారు.

This website uses cookies.