Categories: TOP STORIES

ప్రాపర్టీలకు ఫుల్ డిమాండ్

కరోనా తర్వాత రియల్ రంగంలో భారీ వృద్ధి

పట్టణీకరణ పెరగడం, మధ్యతరగతి విస్తరించడమే కారణం

భారత రియల్ రంగం జోరుగా పరుగులు తీస్తోంది. దేశవ్యాప్తంగా ప్రాపర్టీలకు ఫుల్ డిమాండ్ ఉండటంతో ఈ రంగం అభివృద్ధి పథాన పయనిస్తోంది. ముఖ్యంగా కరోనా తర్వాత సవాళ్లు ఎదుర్కొన్న స్థిరాస్తి రంగం.. అనంతర కాలంలో బాగా పుంజుకుంది. ప్రస్తుతం ప్రాపర్టీలకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో రియల్ వృద్ధి రేటు బాగా పెరిగింది.

పట్టణీకరణ పెరగడం, మధ్యతరగతి ప్రజలు విస్తరించడం, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందడం వంటి అంశాలు రియల్ రంగ వృద్ధికి ప్రధాన కారణాలని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే విదేశీ పెట్టుబడులతోపాటు ప్రభుత్వాల సహకారం కూడా ఇందుకు దోహదపడుతోందని విశ్లేషిస్తున్నారు. ఫలితంగా మార్కెట్ సానుకూలంగా వెళ్తోందని చెబుతున్నారు. దీంతో ఇన్వెంటరీలో తగ్గుదల నమోదై.. డెవలపర్లు దేశంలోని ప్రధాన నగరాల్లో కొత్త ప్రాజెక్టులను చేపట్టి తమ పోర్ట్ ఫోలియోలను విస్తరించుకుంటూ హౌసింగ్ డిమాండ్ ను అందుకోవడానికి కృషి చేస్తున్నారు. అలాగే కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు పలు ఆకర్షణీయమైన పథకాలు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఆధునిక సౌకర్యాలు ఉన్న కొత్త ప్రాజెక్టులకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. దీంతో బిల్డర్లు కూడా సౌకర్యాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు.

This website uses cookies.